ఇజ్రాయెలీ దళాల కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్ల మృతి

ABN , First Publish Date - 2022-03-16T00:00:46+05:30 IST

వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెలీ దళాల కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు

ఇజ్రాయెలీ దళాల కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్ల మృతి

రమల్లా : వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెలీ దళాల కాల్పుల్లో ఇద్దరు పాలస్తీనియన్లు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది.ఇది న్యాయ ప్రక్రియను అనుసరించకుండా హత్య చేయడమేనని పాలస్తీనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేరాలు యుద్ధ నేరాల క్రిందకు వస్తాయని తెలిపింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం బాధ్యులను శిక్షించాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. 


అధికారంలో ఉన్న పాలస్తీనియన్ ఇస్లామిస్ట్ గ్రూప్ హమస్ అధికార ప్రతినిధి హజెమ్ కస్సెమ్ మాట్లాడుతూ, ఈ భూమిపై ఆక్రమణకు తెర దించడం కోసం నూతన శకం సంఘర్షణ, తిరుగుబాటు వస్తున్నాయని చెప్పారు. 


వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్, ఈస్ట్ జెరూసలెంలను 1967లో మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతాల్లోని పాలస్తీనియన్లు ప్రత్యేక దేశం హోదా కోసం పోరాడుతున్నారు. 2014లో చిట్టచివరిసారి జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. 


అయితే ఇజ్రాయెలీ సరిహద్దు పోలీసుల కథనం ప్రకారం, అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసేందుకు వెళ్ళినపుడు ఘర్షణలు జరిగాయి. నార్తర్న్ వెస్ట్ బ్యాంక్‌లో శరణార్థుల శిబిరంలో ఆపరేషన్ జరిగింది. ఆ సమయంలో ఓ గన్‌మేన్ కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ఆ గన్‌మేన్ మరణించాడు. జెరూసలెం వద్దనున్న మరొక శరణార్థి శిబిరంలో ఓ వ్యక్తిని అరెస్టు చేయడానికి వెళ్ళినపుడు, వందలాది మంది పాలస్తీనియన్లు రకరకాల వస్తువులను ఇళ్లపై నుంచి పోలీసులపైకి విసిరారు. మరణించిన వ్యక్తి ఈ ఘర్షణలో పాల్గొన్నాడో, లేదో తెలియదు. 


Updated Date - 2022-03-16T00:00:46+05:30 IST