అంతర్‌ జిల్లా/రాష్ట్ర ప్రయాణాలకు ఈ-పాస్‌లు జారీ

ABN , First Publish Date - 2021-05-11T04:49:42+05:30 IST

కర్ఫ్యూ నేపథ్యంలో వైద్యం, ఇతర అత్యవసర పనులపై ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ప్రయాణం చేయాలనుకునేవారు ఈ-పాస్‌ను పొందాలని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా సూచించారు.

అంతర్‌ జిల్లా/రాష్ట్ర ప్రయాణాలకు ఈ-పాస్‌లు జారీ

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
తగిన ఆధారాలు సమర్పిస్తే జారీ
నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా


విశాఖపట్నం, మే 10 (ఆంధ్రజ్యోతి): కర్ఫ్యూ నేపథ్యంలో వైద్యం, ఇతర అత్యవసర పనులపై ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ప్రయాణం చేయాలనుకునేవారు ఈ-పాస్‌ను పొందాలని నగర పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా సూచించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 12 నుంచి మరుసటిరోజు ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనివల్ల వైద్యంతో పాటు ఇతర అత్యవసర పనులపై బయటకు వెళ్లాల్సినవారు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ ఈ-పాస్‌లను జారీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నగర వాసులు ఎవరైనా  ఇతర జిల్లాలకు లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే తగిన ఆధారాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ కోరారు. సెల్‌ఫోన్‌ లేదా కంప్యూటర్‌ నుంచి ట్ఛటఠిజీఛ్ఛిౌుఽజూజీుఽ్ఛ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి...దరఖాస్తుదారుడి పేరు, చిరునామా, ఈ-మెయిల్‌ అడ్రస్‌, గుర్తింపు కార్డు, ప్రయాణానికి సంబంధించిన వివరాలు సమర్పించాలన్నారు. అంతర్‌ జిల్లా ప్రయాణమైతే...కారణాలు సహేతుకమని భావిస్తే నగర పోలీస్‌ కమిషనరేట్‌ నుంచే ఈ-పాస్‌ దరఖాస్తుదారుడి ఈ-మెయిల్‌ లేదా వాట్సాప్‌కు చేరిపోతుందన్నారు. అదే అంతర్‌ రాష్ట్ర ప్రయాణానికి సంబంధించిన దరఖాస్తు అయితే వివరాలన్నీ సరిపోయినట్టు నిర్ధారించుకున్న తర్వాత ఈ-పాస్‌ జారీకి రాష్ట్ర డీజీపీకి సిఫారసు చేస్తామన్నారు. నగర పరిధిలో ఈ-పాస్‌ వ్యవహరాలను చూసే బాధ్యతను సీసీఎస్‌ ఏసీపీ డి.శ్రావణ్‌కుమార్‌కు అప్పగించామన్నారు. ఎవరికైనా సందేహాలు వుంటే పోలీస్‌ వాట్సాప్‌ నంబర్‌ 9493336633 నంబర్‌ లేదా  ఈ-మెయిల్‌  ఛిఞఠిటఞఛిఃజఝ్చజీజూ.ఛిౌఝ సంప్రతించాలని సీపీ కోరారు.

Updated Date - 2021-05-11T04:49:42+05:30 IST