Advertisement

ఐటీకి భయపడి.. ఇళ్లు అమ్మకానికి పెట్టిన రాగిణి..!

Sep 16 2020 @ 08:19AM

బెంగళూరు (ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటికే అరెస్టు అయి జైలు జీవితం గడుపుతున్న సినీ నటి రాగిణి యలహంకలో తాను ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌ను అమ్మకానికి ఉంచారా? సామాజిక మాధ్యమాల్లో ఈ మేరకు కథనాలు గుప్పుమంటున్నాయి. రాగిణి తన ఆస్తులను ఆదాయపు పన్నుల శాఖ ఎక్కడ జప్తు చేస్తుందోనన్న భయంతోనే యలహంకలోని ఈ అపార్ట్‌మెంట్‌ను అమ్మకానికి పెట్టినట్టు భావిస్తున్నారు. ఇంతవరకు అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని సమాచా రం. ఈ ఇంటిని కొనుగోలు చేస్తే రానున్న రోజుల్లో చట్టపరమైన సమస్యలు తలెత్తుతాయోమోనని కొందరు భయపడుతున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తరుణంలోనే రాగిణి మెడకు డ్రగ్స్‌ వ్యవహారం చుట్టుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే హైదరాబాద్‌కు షూటింగ్‌ నిమిత్తం వెళ్లిన రాగిణి కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మురళీధర్‌రావును భేటీ అయ్యారు. తక్షణం పార్టీలో ఎలాంటి పదవులు వద్దని ఒక సామాన్య కార్యకర్తగా సేవలందిస్తానని రాగిణి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రాగిణిని పార్టీలోకి చేర్చుకొని బీబీఎంపీ ఎన్నికల్లో ప్రచా రం కోసం ఆమె సేవలను వినియోగించుకోవాలని పలువురు నే తలు భావించారు. ఇంతలోనే డ్రగ్స్‌ వ్యవహారంలో ఆమె అరెస్ట్‌ కావడంతో ఈ నేతలంతా గప్‌చిప్‌ అయినట్లు సమాచారం.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.