Child’s Behavior : పిల్లల ప్రవర్తనలో అనుకోని మార్పును గమనించారా? అది మానసిక సమస్య కావచ్చు..!

ABN , First Publish Date - 2022-10-07T17:32:08+05:30 IST

తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎంత శ్రద్ధగా గమనిస్తూ ఉన్నా పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి.

Child’s Behavior : పిల్లల ప్రవర్తనలో అనుకోని మార్పును గమనించారా? అది మానసిక సమస్య కావచ్చు..!

పేరెంటింగ్ అనేది చాలా కష్టమైన పాత్రల్లో ఒకటి. తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎంత శ్రద్ధగా గమనిస్తూ ఉన్నా పిల్లల ప్రవర్తనలో వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ ఉండాలి. లేదంటే ఇది పిల్లల్లో మానసిక అనారోగ్యానికి దారితీయవచ్చు. ప్రతి సంవత్సరం మన దేశంలో 25 శాతం మంది పిల్లలు మానసిక రుగ్మతలకు గురవుతున్నారని అధ్యయనాలు చెపుతున్నాయి. పిల్లల్లో మామూలుగా కనిపించే మానసిక రుగ్మతులు డిప్రెషన్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD), ఆందోళన, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD), ఆటిజం. 


తల్లిదండ్రులుగా పిల్లల ప్రవర్తనలో కొత్తగా కనిపించే ఏదైనా మార్పును గమనించడం చాలా ముఖ్యం. పిల్లల్లో నియంత్రించలేని ప్రవర్తన, కడుపునొప్పి, తలనొప్పి, దీర్ఘకాలంగా విచారంలో ఉండటం, కారణం లేకుండానే బరువు తగ్గడం, చదువులో చురుకుదనం లేకపోవడం నిద్రలో పీడకలలు, మానసిక కల్లోలం, చికాకు, శారీరక శ్రమ తగ్గడం వంటి లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే డాక్టర్ సలహాను తీసుకోవాలి.


నిరాసతో మరణం గురించి మాట్లాడినా, కూడా మానసిక అనారోగ్యానికి సూచనగా తీసుకోవాలి, పిల్లలు కొన్ని సమయాల్లో ఇతరులతో కలవడానికి ఇష్టపడపోవడం, ఆహారం తీసుకోవడం తగ్గిస్తారు. ఇలాంటి మార్పులను పిల్లల్లో గమనించినట్లయితే అప్రమత్తంగా ఉండాలి. చదువులోని ఒత్తిడి, వయసుతో వస్తున్న మార్పులు, కుటుంబ వాతావరణం ఇలా చాలా పరిస్థితులు పిల్లల మానసిక స్థితిని నిర్దేసిస్తాయి. 


ఇలా చేయండి..

1. నులగురితో కలివిడిగా ఉండేలా వారిని ప్రోత్సహించాలి. 

2. స్నేహితులుతో కలిసి ఆడుకునేలా, సమయాన్ని గడిపేలా చూడాలి. 

3. స్కూల్లో పిల్లల ప్రవర్తన గురించి ఉపాద్యాయుల నుంచి సమాచారం అడిగి తెలుసుకోవాలి.

4. రాత్రి పడుకునే ముందు వారి రోజువారి సమయం ఏలా గడిచిందో తెలుసుకోవాలి. 

5. కథలు, కబుర్లతో కాస్త సమయాన్ని గడపడం పిల్లల్లో ఒంటరితనాన్ని పోగొడుతుంది.

Updated Date - 2022-10-07T17:32:08+05:30 IST