కదంతొక్కిన తమ్ముళ్లు

ABN , First Publish Date - 2021-10-20T05:30:00+05:30 IST

వైసీపీ అరాచక దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌లో భాగంగా... బుధవారం జిల్లా లో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన బంద్‌ పోలీసుల నిర్బంధ జులుం, ఆంక్షల మధ్య సాగింది.

కదంతొక్కిన తమ్ముళ్లు
అనంతపురంలోని జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కాలవ శ్రీనివాసులు, నాయకులు

తగ్గేదే లేదు..!

కదంతొక్కిన తమ్ముళ్లు

పోలీసుల నిర్బంధ జులుం...! 

బంద్‌పై అడుగడుగునా ఆంక్షలు 

టీడీపీ ముఖ్య నేతల గృహ నిర్బంధం  

ద్వితీయ శ్రేణి నాయకుల అరెస్టుల పర్వం

అనంతపురం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ అరాచక దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయు డు పిలుపు మేరకు రాష్ట్ర బంద్‌లో భాగంగా... బుధవారం జిల్లా లో ఆ పార్టీ శ్రేణులు చేపట్టిన బంద్‌ పోలీసుల నిర్బంధ జులుం, ఆంక్షల మధ్య సాగింది. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఏస్థాయిలో జులుం ప్రదర్శించినా.. టీడీపీ నేతలు, శ్రేణులు వెరవలేదు. అరెస్టులు చేస్తారని తెలిసినా.. తగ్గేదేలేదు అన్న చందం గా కదంతొక్కారు. టీడీపీ ముఖ్య నేతలను గృహనిర్బంధం చే యడంతోపాటు ద్వితీయ శ్రేణి నాయకులను ఎక్కడికక్కడ అ రెస్టు చేసి, స్టేషన్లలో బందీ చేశారు. బంద్‌ నిర్వీర్యం చేసేలా పోలీసుల ఆంక్షలు చేపట్టినప్పటికీ... వాటికి వెరవకుండా... పోలీ సు వలయాన్ని ఛేదించుకుని ఒకరిద్దరు ముఖ్య నేతలతోపాటు ఆ పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ స్థానికంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ అరాచక పాలనపై గళం విప్పారు. ‘ముఖ్యమంత్రి డౌన... డౌన..’ అంటూ ఆ పార్టీ శ్రేణు లు చేసిన నినాదాలు జిల్లావ్యాప్తంగా మిన్నంటాయి. బంద్‌ నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. టీడీపీ ముఖ్య నేతలతోపాటు ద్వితీయ శ్రేణి నాయకత్వంపైనే ప్రధానంగా దృష్టి సారించింది. ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధం పేరు తో తెల్లవారకముందే ముఖ్య నేతల ఇళ్లకు పోలీసు బలగాలు చేరుకున్నాయి. జిల్లాకేంద్రంలో నివాసముంటున్న టీడీపీ ముఖ్య నేతలతోపాటు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని పార్టీ ఇనచార్జ్‌లు, ద్వితీయశ్రేణి నాయకుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు రా కుండా బందోబస్తు చర్యలు చేపట్టారు. పోలీసు వలయాన్ని ఛే దించుకుని రోడ్డెక్కి నిరసనలు, ఆందోళనలు చేపట్టిన నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి, స్టేషన్లలో ఉం చారు. ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో పోలీసులు, టీడీపీ శ్రేణు ల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి పరిస్థితులు దారితీశా యి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రభుత్వ పెద్దలో... అధికార పా ర్టీ ముఖ్య నేతల ఆదేశాలో.. ఏమోగానీ.. టీడీపీ ముఖ్య నేతలు గడప దాటకుండా పోలీసులు పనిచేశారన్నది నిర్వివాదాంశం.




ముఖ్య నేతల గృహనిర్బంధం

జిల్లాలో బంద్‌ చేపట్టకుండా పోలీసులు టీడీపీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. జిల్లాకేంద్రంలో పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు బీకే పార్థసారఽథి, మాజీ మం త్రి పల్లె రఘునాథరెడ్డి, అనంతపురం అర్బన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, జడ్పీ మాజీ చైర్మన పూల నాగరాజును గృహనిర్బంధం చేశారు. చంద్రదండు వ్యవస్థాపకుడు ప్రకా్‌షనాయుడు, రైతు సంఘం రాష్ట్ర నేత రాయల్‌ మురళి, ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సరిపూటి రమణ, నారాయణస్వామి యాదవ్‌, బుగ్గయ్య చౌదరి, జేఎల్‌ మురళి, కృష్ణకుమార్‌, ప్రచార కార్యదర్శి బీవీ వెంకటరాముడుతోపాటు తెలుగు యువత అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ యాదవ్‌, వెంకటప్ప, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు లక్ష్మీనారాయ ణ, గుత్తా ధనుంజయనాయుడును వారి వారి ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకుని, స్టేషనలో ఉంచారు. కళ్యాణదుర్గంలో ఆ ని యోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు, మాజీ ఎమ్మె ల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి, కరణం రామ్మోహన చౌదరిని గృహనిర్బంధం చేశారు. అమిలినేని లక్ష్మీనారాయణతోపా టు ఇతర నేతలను వారి వారి ఇళ్ల వద్ద అరెస్టు చేసి, స్థానిక స్టే షన్లకు తరలించారు. కదిరిలో ఆ నియోజకవర్గ ఇనచార్జ్‌ కందికుంట వెంకటప్రసాద్‌, తెలుగు యువత హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు బాబ్‌జాన ఇంటి నుంచి బయటకు రాగానే... పోలీసులు అదుపులోకి తీసుకుని, స్థానిక స్టేషన్లకు తరలించారు. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న అనంతపురం నుంచి మడకశిరకు వెళ్తుండగా... మార్గమధ్యలో పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. మడకశిర స్టేషనకు తరలించారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. ఆ పార్టీ స్థానిక నాయకులు సోమశేఖర్‌నాయుడుతోపాటు పలువురు కౌన్సిలర్లను వారి వారి ఇళ్ల వద్ద నుంచే అదుపులోకి తీసుకుని, స్టేషనలో బందీ చేశారు. యాడికిలో మాజీ ఎంపీపీ రంగయ్యతోపాటు మరి కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని, స్టేషనలో ఉంచారు. గుంతకల్లులో మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ను గృహనిర్బంధం గావించారు. స్థానిక కౌన్సిలర్‌ పవనకుమార్‌ గౌడ్‌ను హౌస్‌ అరెస్టు చేశారు. ఉరవకొండలో ఇరిగేషన డెవల్‌పమెంట్‌ కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ దేవినేని పురుషోత్తం, మండల కన్వీనర్లు విజయభాస్కర్‌, నూతేటి వెంకటేష్‌ను ముందస్తు అరెస్టులు చేసి, స్టేషనకు తరలించారు. హిందూపురంలో ఆ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి అంజినప్ప, పట్టణాధ్యక్షుడు రమేష్‌, పార్లమెం టు అధికార ప్రతినిధి జేవీ అనిల్‌కుమార్‌ను గృహనిర్బంధం చేశారు. పుట్టపర్తిలో మున్సిపల్‌ మాజీ అధ్యక్షుడు గంగన్నను హౌస్‌ అరెస్టు చేశారు. సాయంత్రం వరకూ స్టేషనలో ఉంచుకుని, అనంతరం వదిలారు. 



ఆందోళనలు... ఉద్రిక్తతలు...

జిల్లాకేంద్రంలో ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని, ఆ పార్టీ అనంతపురం పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌ చౌదరి, రాష్ట్ర కార్యదర్శి ఆదినారాయణతోపాటు మరికొందరు కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. టైర్లుకాల్చి ప్రభుత్వ దమననీతిని ఎండగట్టారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని, కాలవ శ్రీనివాసులుతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలను బలవంతంగా అరెస్టు చేసి, వనటౌన స్టేషనకు తరలించారు. ధర్మవరంలో స్థానిక పార్టీ శ్రేణులు.. పోలీసు ఆంక్షలకు వెరవకుండా బంద్‌ చేయించేందుకు ర్యాలీ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు.. వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల జులుం నశించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రామగిరి మండలం వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ను వారి నివాసం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ... పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్‌ పార్టీ శ్రేణులతో కలిసి పోలీసుల వలయాన్ని ఛేదించుకుని, గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి, ఆందోళన చేశారు. గుత్తిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటశివుడు యాదవ్‌ స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. పోలీసులు వెంకటశివుడుయాదవ్‌తోపాటు పలువురిని అరెస్టు చేశారు. ఆ క్రమం లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగనకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు లో ఆ పార్టీ స్థానిక నాయకులు.. సీఎం జగన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. హిందూపురం నియోజకవర్గ కేంద్రంలో పార్టీ శ్రేణులు ఒక్కతాటిపైకి వచ్చి, పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆందోళనకారులందరినీ అరెస్టు చేశారు. గుంతకల్లులో ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు ఆనంద్‌ ఆధ్వర్యంలో శ్రేణులు ఆర్టీసీ బస్టాండు, పాత గుంతకల్లు రోడ్డులో నిరసనలు చేపట్టారు. దీం తో పోలీసులు.. వారిని బలవంతంగా అరెస్టు చేశారు. పెనుకొండలో కురుబ కార్పొరేషన మాజీ చైర్‌పర్సన సవిత ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు ప్రధాన రహదారులపై నిరసన ర్యా లీలు చేపట్టారు. పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోళనకారులను అరె స్టు చేశారు. కదిరిలో తెలుగు యువత నేత రాజేంద్రనాయుడు, పార్టీ శ్రేణులు అంబేడ్కర్‌ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు.



మాజీ మంత్రి కాలవపై కేసు నమోదు

అనంతపురం క్రైం: మాజీ మంత్రి, టీడీపీ అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులుపై కేసు నమోదైంది. అనుమతులు లేకుండా ఆందోళనలో పాల్గొనడం, రహదారిని దిగ్బంధించడం, ఇతర నిబంధనలను అతిక్రమించాడన్న అభియోగాలపై కాలవపై అనంతపురం నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరో పది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రెడ్‌ విత 34 ఐపీసీ కింద కాలవకు నోటీసులు సైతం జారీ చేశారు. టీడీపీ పిలుపు నేపథ్యంలో కాలవ శ్రీనివాసులు పోలీసు నిర్బంధాలను ఛేదించుకుని, ఆందోళన చేపట్టారు. అనంతపురం నగర పరిధిలోని రవి పెట్రోల్‌ బంకు సమీపాన జాతీయ రహదారిని దిగ్బంధిచడంపై పోలీసులు ఇలా చర్యలు తీసుకున్నారు.



Updated Date - 2021-10-20T05:30:00+05:30 IST