క్వింటిలియన్‌లో అదానీకి 49% వాటా

ABN , First Publish Date - 2022-05-16T06:11:22+05:30 IST

అదానీ గ్రూప్‌ మీడియా వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా రాఘవ్‌ బహాల్‌ ప్రమోట్‌ చేసిన క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (క్యూబీఎంఎల్‌) ఈక్విటీలో 49 శాతం వాటా కొనుగోలు చేసింది.

క్వింటిలియన్‌లో అదానీకి 49% వాటా

 న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌ మీడియా వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా రాఘవ్‌ బహాల్‌ ప్రమోట్‌ చేసిన క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (క్యూబీఎంఎల్‌) ఈక్విటీలో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ ద్వారా ఈ వాటా కొనుగోలు చేసింది. అయితే ఎంత మొత్తానికి ఈ వాటా కొనుగోలు చేసిందీ రెండు కంపెనీలు వెల్లడించలేదు. క్యూబీఎంఎల్‌ ప్రస్తుతం ఒక బిజినెస్‌, ఫైనాన్షియల్‌ న్యూస్‌ పోర్టల్‌ నడుపుతోంది. ఏఎంజీ మీడియా నెట్‌వర్క్‌ ద్వారా అదానీ గ్రూప్‌ పెద్ద ఎత్తున మీడియా రంగ ప్రవేశానికి సిద్ధమవుతోంది. 

Updated Date - 2022-05-16T06:11:22+05:30 IST