సంక్షేమ పథకాలను తాయిలాలనడం అవమానకరం

ABN , First Publish Date - 2022-09-25T05:55:59+05:30 IST

పేదలకు తోడ్పా టునందించే సంక్షేమ పథకాలను దేశ ప్రధాని పద విలో ఉన్న వ్యక్తి తాయిళాలుగా చులకన చేసి మా ట్లాడటం అవమానకరమని పాలమూరు అధ్య యన వేదిక కన్వీనర్‌ ఎం.రాఘవాచారి అభ్యంతరం వ్యక్తం చేశారు.

సంక్షేమ పథకాలను తాయిలాలనడం అవమానకరం
సెమినార్‌లో మాట్లాడుతున్న పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి

- పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి 


గద్వాల టౌన్‌,  సెప్టెంబరు 24: పేదలకు తోడ్పా టునందించే సంక్షేమ పథకాలను దేశ ప్రధాని పద విలో ఉన్న వ్యక్తి తాయిళాలుగా చులకన చేసి మా ట్లాడటం అవమానకరమని పాలమూరు అధ్య యన వేదిక కన్వీనర్‌ ఎం.రాఘవాచారి అభ్యంతరం వ్యక్తం చేశారు.   ఇలాంటి వ్యాఖ్యలు రాజ్యాంగంలో పేర్కొన్న సంక్షేమ రాజ్యభావననే విస్మరించడమ న్నారు. పట్టణంలోని టీఎన్జీవో భవనంలో శనివారం వేదిక ఆధ్వర్యంలో ’సంక్షేమ పథకాలు ఉచితాలు ఎ లా అవుతాయి’ అనే అంశంపై నిర్వహించిన సెమి నార్‌కు ఆయన హాజరై, మాట్లాడారు.  నరేంద్ర మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక సంక్షేమ పథకాలను రద్దు చేయాలనే కుట్ర దాగి ఉందని ఆ రోపించారు. అదే సమయంలో సంక్షేమ పథకాల అ మలుతో అనేక రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీలు అధికా రంలో ఉండటాన్ని బీజేపీ పాలకులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. 75ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో 40శాతం మంది ప్రజలు దారిద్య్రంలోనే ఉన్న నేప థ్యంలో సంక్షేమ పథకాల అమలు అనివార్యమ న్నారు. వేదిక మహబూబ్‌నగర్‌ జిల్లా కోకన్వీనర్‌ కేసీ.వెంకటేశ్వర్లు, స్థానిక న్యాయవాది ఎం.మధుసూ దన్‌బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, టీపీఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి ప్రభాకర్‌, యూటీఎఫ్‌ సీనియర్‌ నాయకుడు రామన్‌గౌడ్‌లు తమ ప్రసం గాల్లో సంక్షేమ పథకాలను రద్దు చేయాలని ప్రయ త్నించే వారికి ప్రజల నుంచి తిరస్కరణ తప్పదని హెచ్చరించారు. గద్వాల జిల్లా వేదిక కన్వీనర్‌ ఇక్బా ల్‌బాష అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో డీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు వామన్‌కుమార్‌, పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-25T05:55:59+05:30 IST