అప్రజాస్వామికం

ABN , First Publish Date - 2021-02-28T05:47:01+05:30 IST

‘పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా వైసీపీ నాయకులు, మంత్రి సీదిరి అప్పలరాజు వ్యవహరించడం లేదు. బి-ఫారాలు పొందిన అభ్యర్థులను మరో పార్టీలో చేర్చుకోవడం అప్రజాస్వామిక’మని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. శనివారం ఆమె వజ్జ బాబూరావు గృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. శుక్రవారం తాము నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నలుగురు కౌన్సిలర్లు అభ్యర్థులు శనివారం ఉదయం 11 గంటలకు ఆ పార్టీలో చేరినట్లు సోషల్‌మీడియాలో పెట్టారని తెలిపారు. దౌర్జన్యంగా, ప్రలోభాలు పెట్టి వారిని తీసుకెళ్లారని ఆరోపించారు. బి ఫారాలు పొందిన వ్యక్తులను ఏ విధంగా చేర్పించుకుంటారని ప్రశ్నించారు.

అప్రజాస్వామికం
పలాసలో టీడీపీ నేతలతో సమావేశమైన గౌతు శివాజీ, శిరీష

బి-ఫారాలు పొందిన అభ్యర్థులను పార్టీలో చేర్చుకోవడం అక్రమం

మళ్లీ నామినేషన్లు స్వీకరించాలని ఎస్‌ఈసీని కోరుతాం

టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష

పలాస : ‘పలాస-కాశీబుగ్గ మునిసిపల్‌ ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా వైసీపీ నాయకులు, మంత్రి  సీదిరి అప్పలరాజు వ్యవహరించడం లేదు. బి-ఫారాలు పొందిన అభ్యర్థులను మరో పార్టీలో చేర్చుకోవడం అప్రజాస్వామిక’మని  టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. శనివారం ఆమె వజ్జ బాబూరావు గృహంలో విలేకరులతో మాట్లాడుతూ.. శుక్రవారం తాము నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నలుగురు కౌన్సిలర్లు అభ్యర్థులు శనివారం ఉదయం 11 గంటలకు ఆ పార్టీలో చేరినట్లు సోషల్‌మీడియాలో పెట్టారని తెలిపారు. దౌర్జన్యంగా, ప్రలోభాలు పెట్టి వారిని తీసుకెళ్లారని ఆరోపించారు. బి ఫారాలు పొందిన వ్యక్తులను ఏ విధంగా చేర్పించుకుంటారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై మొత్తం ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆ వార్డుల్లో మళ్లీ నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలని కోరనున్నామని తెలిపారు. ఆ నాలుగు వార్డుల్లో డమ్మీగా వేసిన అభ్యర్థులనే బరిలో నిలిచేలా చర్యలు చేపడతామన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేలా కలెక్టర్‌, ఎస్పీ తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు. కాశీబుగ్గ పోలీసులపై తమకు నమ్మకం లేదని, వారి స్థానంలో వేరేవారిని నియమించాలని విజ్ఞప్తి చేశారు. బెదిరింపులు వస్తున్న వేళ.. రక్షణ కల్పించే దిశగా తమ అభ్యర్థులను రహస్య స్థావరాలకు తరలించామని తెలిపారు. 


 చరిత్రలో ఇటువంటిది ఎరగను:

39 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇటువంటి సంఘటనలు ఏనాడు చూడలేదని మాజీమంత్రి గౌతు శ్యామసుందరశివాజీ అన్నారు. అధికార పార్టీ నేతలు దుర్మార్గమైన, నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. జంట పట్టణాల్లో రేపటి పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలుగుతోందని, చదువుకున్న వ్యక్తిగా మంత్రి ఈ విధంగా ఆలోచించడం తగదని ఆక్షేపించారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహణకు పోలీసులు, కలెక్టర్‌ సహకరించాలని   కోరారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా తాము విజయం సాధిస్తామని వజ్జ బాబూరావు పేర్కొన్నారు. ఓడిపోతామన్న భయంతో వైసీపీ నాయకులు తమ అభ్యర్థులను భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని సవాల్‌ విసిరారు.


సంఘటనపై చంద్రబాబునాయుడు ఫోన్‌:

టీడీపీ అధినేత  నారా చంద్రబాబునాయుడు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషకు శనివారం ఫోన్‌ చేశారు. పలాస-కాశీబుగ్గలో సంఘటనపై చర్చించారు. మునిసిపాలిటీలో పరిస్థితిపై ఆరా తీశారు. బి.ఫారాలు ఇచ్చిన తరువాత పార్టీ నుంచి వీడడంపై ఎన్నికల కమిషన్‌ను కలుద్దామని ఈ సందర్భంగా సూచించారు. 

Updated Date - 2021-02-28T05:47:01+05:30 IST