ఆర్‌ఏఆర్‌ఎ్‌సను నిర్వీర్యం చేయడం తగదు

ABN , First Publish Date - 2021-11-29T05:51:59+05:30 IST

నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని నిర్వీర్యం చేయడం తగదని, వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూ కేటాయింపు విషయంలో ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు పునఃరాలోచించుకోవాలని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైౖర్మన్‌, టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆర్‌ఏఆర్‌ఎ్‌సను నిర్వీర్యం చేయడం తగదు

  1. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డి 


నంద్యాల, నవంబరు 28: నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని నిర్వీర్యం చేయడం తగదని, వైద్య కళాశాలకు ఆర్‌ఏఆర్‌ఎస్‌ భూ కేటాయింపు విషయంలో ప్రభుత్వం, స్థానిక ప్రజా ప్రతినిధులు పునఃరాలోచించుకోవాలని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైౖర్మన్‌,  టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్‌లో అనేక రకాల పంటల్లో కొత్తవంగడాల సృష్టి, రైతులకు మేలు చేకూరేవిధంగా సమగ్ర సస్యరక్షణ సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు. ఆర్‌ఏఆర్‌ఎ్‌సను మరింత అభివృద్ధి చేయాల్సిందిపోయి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని నిర్వీర్యం చేస్తుండడం దుర్మార్గమన్నారు. నంద్యాలకు మెడికల్‌ కాలేజీ రావడానికి స్వాగతిస్తున్నామని, అయితే 50 ఎకరాల పరిశోధన భూమిని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. మెడికల్‌ కాలేజీ నిర్మాణాన్ని టీడీపీ అడ్డుకుంటుందని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి శాసనసభలో చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రైతులు, రైతుసంఘాల నాయకులు కోర్టును ఆశ్రయించారని, టీడీపీకి ఇందులో భాగస్వామ్యం లేదన్నారు. 


Updated Date - 2021-11-29T05:51:59+05:30 IST