మహిళలను గౌరవించడం మన సంస్కృతి

ABN , First Publish Date - 2021-03-09T06:02:43+05:30 IST

మహిళలను గౌరవించడం మన సంస్కృతి

మహిళలను గౌరవించడం మన సంస్కృతి
ఇబ్రహీంపట్నంలోని గురునానక్‌ విద్యా సంస్థలో కేక్‌ కట్‌చేస్తున్న ఉద్యోగినులు

  • మహిళా దినోత్సవ వేడుకల్లో వక్తలు

కందుకూరు/యాచారం/ఇబ్రహీంపట్నం/ఆదిభట్ల/మహేశ్వరం: మహిళలను గౌరవించే సంస్కృతి మన భారతీయులకే సాధ్యమని, ప్రాశ్చా త్య నాగరికతకు స్వస్తి పలకాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ కె.కవిత, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డిలను నగరంలోని వారి నివాసాల్లో కలిసి సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు మూల హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు. బైరాగూడ సర్పంచ్‌ ఎ.వాసవిరేఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీటీసీ బి.జంగారెడ్డి, నాయకులు లక్ష్మీనర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, జయేందర్‌, మహేందర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు. దాసర్లపల్లిలో సర్పంచ్‌ పి.బాలమణి, ఎంపీటీసీ టి.ఇందిరదేవేందర్‌ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కందుకూరులో స్నేహ మహిళా సొసైటీ అధ్యక్షురాలు జి.కవిత నేతృత్వంలో కేక్‌ కట్‌చేసి సంబురాలు జరుపుకున్నారు. యాచారం మండల పరిధి గ్రామాల్లో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. ఎంపీపీ సుకన్య, జడ్పీటీసీ జంగమ్మ, ఎంపీడీవో మమతాబాయి, ఆవోఆర్డీ శ్రీలత, ఆఫీసు సూపరింటెండెంట్‌ శైలజ, సర్పంచులు, ఎంపీటీసీలు కేక్‌ కట్‌చేసి ఒకరినొకరు తినిపించుకున్నారు. తాడిపర్తిలో సర్పంచ్‌ రమేష్‌ మహిళా మహిళలను సత్కరించారు. ఇబ్రహీంపట్నం పరిధి గురునానక్‌ విద్యా సంస్థల్లో ఉద్యోగినులు, విద్యార్థినులు కేక్‌ కట్‌చేశారు. విద్యాసంస్థల వైస్‌చైర్మన్‌ జీ.ఎ్‌స.కోహ్లీ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. ఎండీ డా.హెచ్‌ఎ్‌స.సైనీ, జీఎన్‌ఐటీసీ డైరెక్టర్‌ డా.ఎం.రామలింగారెడ్డి, జీఎన్‌ఐటీ ప్రిన్సిపాల్‌ డా.ఎ్‌స.శ్రీనాధరెడ్డి, డా.పమేలా చావ్లా, డా.దీపాజ్యోతి, డా.శాంతి, డా.జయంతి పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం కోర్టులో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి పద్మావతి, ఏపీపీ వరలక్ష్మిలను సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్‌ చైర్‌పర్సన్‌ ఫర్‌ యూత్‌ ఆవేర్నెస్‌ కేవీ.రమే్‌షరాజు, అధ్యక్షుడు శశిధర్‌, మహే్‌షగౌడ్‌ పాల్గొన్నారు. మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, సర్పంచ్‌లు ప్రియాంక, శివిరాజునాయక్‌, సంధ్యారాజేష్‌ పాల్గొన్నారు. 


  • మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

షాద్‌నగర్‌/అర్బన్‌/రూరల్‌/కేశంపేట/చౌదరిగూడ/కొందుర్గు:  మహిళలు అన్ని రంగాల్లో రాణించి అర్థికంగా ఎదగాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పిలుపునిచ్చారు. ఐఎంఏ షాద్‌నగర్‌ శాఖ సోమవారం ఐఎంఏ కార్యాలయంలో మహిళా కౌన్సిలర్లను, పారిశుధ్య మహిళా సిబ్బందిని సన్మానించారు. హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు విద్య, ఉపాధి రంగాల్లో రాణించాలన్నారు. మహిళా కౌన్సిలర్లను, డాక్టర్లను, పారిశుధ్య కార్మికులను సన్మానించారు. వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, కమిషనర్‌ లావణ్య, ఐఎంఏ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ శారద, ప్రధానకార్యదర్శి డాక్టర్‌ విజయ్‌కుమార్‌, కోశాధికారి తారికేశ్వరి, డాక్టర్‌ నాగిరెడ్డి, డాక్టర్‌ విజయ్‌కుమార్‌, డాక్టర్‌ చైతన్య, డాక్టర్‌ దిలీ్‌పచంద్ర, డాక్టర్‌ రమే్‌షబండారి, డాక్టర్‌ నాగవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. ఫరూఖ్‌నగర్‌ మండలం కొండన్నగూడ, మొగిలిగిద్ద గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు మహిళలను సన్మానించారు. చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, మన్‌మర్రి వెంకటయ్య పాల్గొన్నారు. షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆశారాణిని సన్మానించారు. బీఏఎం డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ వెంకటయ్య దినోత్సవాన్ని జరుపుకున్నారు. పీఎ్‌సలో ఇన్స్‌పెక్టర్‌ భూపాల్‌శ్రీధర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌చేశారు. కేశంపేలో స్ర్తీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దినోత్సవాన్ని నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లకు క్రీడలు నిర్వహించారు. ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి భోజన కార్మికులను సన్మానించారు. చౌదరిగూడలో మహిళా సమాఖ్య లో మహిళా దిన్సోత్సవాన్ని నిర్వహించారు. 

Updated Date - 2021-03-09T06:02:43+05:30 IST