మాట్లాడుతున్న ఎంఎస్ఎఫ్ నాయకులు
-ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్
జగిత్యాల అర్బన్, మార్చి 27: రాజ్యాం గబద్దంగా పరిపాలన అందిస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సీఎం కేసీఆర్ అందుకు విరుద్ధంగా నేడు రాజ్యాంగాన్నే మార్చాలని పేర్కొనడం రాజద్రోహమే అవుతుందని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు, బస్సుయాత్ర సమన్వయ కర్త గోవిందు నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చేప ట్టిన బస్సుయాత్ర ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భం గా స్థానిక జిల్లా ఎంఆర్పీఎస్ కన్వీనర్ దుమాల గంగారాం ఆఽధ్వర్యంలో బస్సు యాత్రకు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని స్థానిక తహశీల్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నరేష్ మాట్లాడుతూ ఎన్ని పోరాటాలు జరిగిన కేవలం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాట్లాడిన కేసీఆర్ నేడు అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్నే మార్చాలనడం దుర్మార్గం అన్నారు. ఆయన నియంతృత్వ విధానాలకు చరమగీతం పాడుతూ, రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా మనమం తా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా ఏప్రిల్ 9న హైదరాబాద్‌లో జరిగే యుద్ధభేరి మహాసభకు పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల ప్రజలందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ బస్సు యాత్ర బృందంలో ఎంఎస్ఎఫ్ జిల్లా ఇంఛార్జ్ బెజ్జంకి అనిల్, ఆరెల్లి మల్లేష్, బెజ్జంకి సతీష్, భోనగిరి కిషన్, నవీన్, మధు, ప్రశాంత్, రాజేష్, వంశీ, గంగాధర్, రాజేంధర్, కిషోర్‌తో పాటు బీసీ సంఘ నేత బాలు యాదవ్ తదితరులున్నారు.