ప్రశ్నించే గొంతుకల ఫోన్లు ట్యాప్‌ చేయటం దుర్మార్గం

ABN , First Publish Date - 2021-07-27T05:28:31+05:30 IST

కేంద్రప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల ఫోన్లు ట్యాప్‌ చేయటం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

ప్రశ్నించే గొంతుకల ఫోన్లు ట్యాప్‌ చేయటం దుర్మార్గం
మహాసభలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

ముదిగొండ/నేలకొండపల్లి, జూలై 26: కేంద్రప్రభుత్వం ప్రశ్నించే గొంతుకల ఫోన్లు ట్యాప్‌ చేయటం సిగ్గుచేటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. సోమవారం ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో బొర్రా శేఖర్‌ అధ్యక్షతన జరిగిన సీపీఎం మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై నల్లచట్టాలు ప్రయోగించటం సరికాదన్నారు. దేశంలో 140కోట్ల జనాభాకు 280కోట్ల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు అవసరం ఉండగా వాటి తయారీలో కేంద్రం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులపై ప్రయోగించాల్సిన పెగాస్‌సను కేంద్రప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు.  హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో లబ్ధి కోసమే సీఎం కేసీఆర్‌ దళిత బంధు, నిరుద్యోగ భృతి అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ముందుగా పార్టీ పతాకాన్ని తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. అనంతరం అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బండి రమేష్‌, జిల్లా కమిటీ నాయకురాలు బండి పద్మ, జిల్లా నాయకుడు రాయల వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్‌, ఎంపీటీసీ కోలేటి అరుణ, నాయకులు టీఎ్‌స.కల్యాణ్‌, భద్రయ్య, రాయల శ్రీనివాసరావు, కోలేటి ఉపేందర్‌, బండి శేఖర్‌, సామినేని రాంబాబు, మందరపు వెంకన్న, ఇరుకు నాగేశ్వరరావు, ఐద్వా మండల అధ్యక్ష, కార్యదర్శులు మందరపు పద్మా, పయ్యావుల ప్రభావతి పాల్గొన్నారు.

నేలకొండపల్లిలో జరిగిన కార్యక్రమంలో మండల కార్యదరి గుడవర్తి నాగేశ్వరరావు, యడ్ల తిరుపారావు, కేవీరెడ్డి, ఏటుకూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-07-27T05:28:31+05:30 IST