big breaking: ఐటీ దాడుల్లో రాజకీయ పార్టీల విరాళాల బాగోతం బట్టబయలు

ABN , First Publish Date - 2022-09-08T16:55:30+05:30 IST

దేశంలోని రాజకీయ పార్టీల బాగోతం మరోసారి బట్టబయలైంది.తాజాగా ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు జరిపిన దాడుల్లో పలు రాజకీయ పార్టీల విరాళాల గుట్టు రట్టు...

big breaking: ఐటీ దాడుల్లో రాజకీయ పార్టీల విరాళాల బాగోతం బట్టబయలు

న్యూఢిల్లీ: దేశంలోని రాజకీయ పార్టీల బాగోతం మరోసారి బట్టబయలైంది.తాజాగా ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు జరిపిన దాడుల్లో పలు రాజకీయ పార్టీల విరాళాల గుట్టు రట్టు అయింది. రాజకీయపార్టీలకు(political parties) విరాళాల పేరిట కోట్లాది రూపాయలను ఇచ్చారని వెల్లడైంది. ఐటీ శాఖ జరిపిన దాడుల్లో(I-T officials conducting raids) దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి.(busted) దేశంలోని రాజకీయ పార్టీలకు మురికివాడలు, చిన్న దుకాణాలు, ఫ్లాట్ల(shops, slums and flats) నుంచి విరాళాలు(donations) అందాయని వెల్లడైంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)రాష్ట్రంలోని సుల్తాన్ పూర్ నగరంలోని వాచ్ రిపేర్ షాపు కేంద్రంగా నడుస్తున్న ఓ గుర్తింపు లేని రాజకీయ పార్టీకి గత మూడేళ్లుగా రూ.370 కోట్ల విరాళాలు అందాయని ఐటీ అధికారుల దాడుల్లో తేలింది.


 దీంతో ఐటీ అధికారులు ఆ గుర్తింపులేని రాజకీయ పార్టీ అధ్యక్షుడి కోసం గాలిస్తున్నారు. వాచ్ రిపేర్ షాపు నడుపుతున్న వ్యక్తికి రాజకీయ పార్టీ విరాళం గురించి తెలియదు. అయితే పార్టీ అధ్యక్షుడు గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉంటారని ఐటీ అధికారులకు సమాచారం అందింది. అహ్మదాబాద్ నగరంలో పార్టీ అధ్యక్షుడిని విచారిస్తే తాను కేవలం 3 శాతం కమీషన్ తీసుకొని పార్టీ విరాళానికి డొనేషన్ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడైంది. ఇలా రాజకీయ పార్టీల విరాళాల పేరిట పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని తేలింది. 


ఇలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు పార్టీల విరాళాల బాగోతం బట్టబయలైంది. మహారాష్ట్రలోని ముంబయి నగరం పరిధిలోని సియాన్ ప్రాంత మురికివాడలో వందగజాల చిన్న గుడిసె చిరునామాతో రిజిస్టరు అయిన ఓ రాజకీయ పార్టీకి గత రెండేళ్లలో వంద కోట్ల రూపాయలకు పైగా విరాళాలు అందాయని ఆ పార్టీ బ్యాంకు రికార్డుల్లో వెల్లడైంది.ముంబైలోని 100కోట్ల రూపాయల విరాళం అందుకున్న రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు కూడా లేక పోవడం విశేషం. తాను మాత్రం పార్టీ అధ్యక్షుడిగా నామమాత్రంగా కొనసాగుతున్నానని, అసలు విరాళాల వ్యవహారాన్ని గుజరాత్(Gujarat) రాష్ట్రంలోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆడిటర్ చూసుకుంటున్నాడని సదరు గుర్తింపు లేని పార్టీ నేత సెలవిచ్చారు.


 దీంతో ఐటీ అధికారులు షాక్ కు గురయ్యారు. విరాళాలు ఇచ్చామని సర్టిఫికెట్లు చూపించి, ఆదాయపు పన్ను రాయితీ పొందిన  వారి బాగోతాలు బయటపడ్డాయి.ముంబయిలోని బోరివలి ప్రాంతంలోని రేకుల షెడ్డులో నడుస్తున్న ఓ రాజకీయ పార్టీ రూ.50కోట్ల విరాళాలను స్వీకరించినట్లు వెల్లడైంది. ఈ విరాళాలు పలువురి చేతులు మారాయని ఐటీ అధికారులు తేల్చారు. దేశంలోని 205 ప్రాంతాల్లో రాజకీయ పార్టీలపై దాడి చేసిన ఐటీ అధికారులకు విరాళాల పేరిట ఆదాయపు పన్ను రాయితీలు(Tax exemption) పొందారని వెల్లడైంది.


ముంబయి(Mumbai), గుజరాత్ ప్రాంతాల్లోని రాజకీయ పార్టీలు రూ.2000కోట్ల విరాళాలు స్వీకరించాయని ఐటీ అధికారులు అంచనా వేశారు. 120 మంది ఐటీ అధికారులు, ఇన్ స్పెక్టర్ల బృందం ముంబయి, గుజరాత్ ప్రాంతాల్లోని 21 రాజకీయ పార్టీల విరాళాల బాగోతంపై దర్యాప్తు సాగిస్తోంది. ఐటీ అధికారులు ఢిల్లీ, ఎన్సీఆర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్(Delhi-NCR, Uttar Pradesh and Rajasthan) ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు రాజకీయ పార్టీల విరాళాలపై దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో 2099 రాజకీయ పార్టీలు రిజిస్టరు కాగా, వీటిలో 2044 పార్టీలకు ఎన్నికల కమిషన్ గుర్తింపు లేదు.(unrecognised parties)


దేశంలో కేవలం 55 రాజకీయ పార్టీలను మాత్రమే కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించింది. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారికి ఆదాయపు పన్ను రాయితీ వర్తిస్తుండటంతో విరాళాల పేరిట అక్రమాలకు తెర లేపారు. దీంతో అప్రమత్తమైన ఆదాయపు పన్ను శాఖ అధికారులు గురువారం కూడా రాజకీయ పార్టీల విరాళాల బాగోతంపై దాడులు కొనసాగిస్తోంది.

Updated Date - 2022-09-08T16:55:30+05:30 IST