వీసా దరఖాస్తుకు ఐటీ రిటర్న్స్ కాపీలు కూడా...

ABN , First Publish Date - 2021-07-23T22:51:34+05:30 IST

వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో గత కొన్నేళ్లుగా మీరు దాఖలు చేసే ఐటీ రిటర్న్స్ తాలూకు ప్రతులను కూడా ఎంబసీలు, కాన్సులేట్లకు అందించాల్సి ఉంటుంది.

వీసా దరఖాస్తుకు ఐటీ రిటర్న్స్ కాపీలు కూడా...

హైదరాబాద్ : వీసా కోసం దరఖాస్తు చేసే సమయంలో గత కొన్నేళ్లుగా మీరు దాఖలు చేసే ఐటీ రిటర్న్స్ తాలూకు ప్రతులను కూడా ఎంబసీలు, కాన్సులేట్లకు అందించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన  ఆదాయపు పన్ను ఫామ్స్ అందుబాటులోకొచ్చాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. అసెస్‌మెంట్ ఇయర్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్స్ ఫైలింగ్ గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా... ఐటీ రిటర్న్స్‌లో పలు రకాల ఫారమ్‌లు ఉంటాయన్న విషయం తెలిసిందే.


వేతనం, ఆస్తులు, డివిడెండ్, వడ్డీ రూపేణా వచ్చే ఆదాయం, కుటుంబ పింఛను వంటివి ఉంటే ఐటీఆర్-1(సహజ్) ఫైల్ చేస్తారు. ఐటీఆర్-1ను కేవలం పర్సన్ ఫైల్ చేయరు. కంపెనీ డైరెక్టర్ వంటి వారు దాఖలు చేస్తారు. ఐటీఆర్ 2, ఐటీఆర్ 4, ఐటీఆర్ 3 ఉంటాయి. కాగా... ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ వల్ల పలు ప్రయోజనాలుంటాయి. వ్యక్తులు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా... అవసరమైన సందర్భాల్లో రుణాలను తేలికగా పొందే వెసులుబాటు ఉంటుంది. ఇక టూ వీలర్ / ఫోర్ వీలర్  లేదా గృహరుణాల వంటి వాటికి సులభంగా ఆమోదం  లభిస్తుంది. దాదాపు అన్ని ప్రధాన బ్యాంకులూ ట్యాక్స్ రిటర్న్స్ కాపీని అడుగుతాయి.


ట్యాక్స్ రీఫండ్ క్లెయిమ్...

ఇక ఆదాయపు పన్ను దాఖలు చేస్తే ట్యాక్స్ రీఫండ్ అవుతుంది. అంటే చెల్లించిన దానికి గాను ఐటీ శాఖ నుండి ఏమైనా రావాల్సి ఉంటే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ద్వారా వాటిని పొందవచ్చు. 


ఆదాయం, అడ్రస్ ప్రూఫ్...

ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేస్తే ఇది ఆదాయ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం కూడా ఉపయోగపడుతుంది.


నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేయవచ్చు...

నిర్ణీత తేదీలోపు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవచ్చు. ఇది తర్వాతి సంవత్సరాల ఆదాయానికి సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.

Updated Date - 2021-07-23T22:51:34+05:30 IST