NRIలకు ఇళ్లు అద్దెకు ఇస్తున్నారా.. అయితే.. ఈ విషయాలపై ఓ లుక్కేయండి

ABN , First Publish Date - 2022-09-20T04:06:38+05:30 IST

ఇంటిని లేదా కమర్షియల్ ప్రాపర్టీలను అద్దెకు ఇస్తే మంచి ఆదాయం వస్తుందన్న విషయం తెలిసిందే. మరి ఎన్నారైలకు ఇళ్లు అద్దెకు ఇచ్చేపట్టప్పుడు ఏ విషయాలను పరిశీలించాలో ఓమారు చూద్దాం.

NRIలకు ఇళ్లు అద్దెకు ఇస్తున్నారా.. అయితే.. ఈ విషయాలపై ఓ లుక్కేయండి

ఎన్నారై డెస్క్: ఇంటిని లేదా కమర్షియల్ ప్రాపర్టీలను అద్దెకు(Rent) ఇస్తే మంచి ఆదాయం వస్తుందన్న విషయం తెలిసిందే. మరి ఎన్నారైలకు ఇళ్లు అద్దెకు ఇచ్చేపట్టప్పుడు ఏ విషయాలను పరిశీలించాలో ఓమారు చూద్దాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎన్నారైలు ఇచ్చే అద్దెల వివరాలను ట్యాక్స్ రిటర్నుల్లో(ITR) కచ్చితంగా పేర్కొనాలి. అదేసమయంలో.. ఎన్నారైలు కూడా టీడీఎస్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. సెక్షన్ 194-1 లేదా సెక్షన్ 1941బీ ప్రకారం వీటిని క్లెయిమ్ చేసుకోవచ్చు.


రూ. 2.40 లక్షలకు మించి అద్దె చెల్లించే ఎన్నారైలు 194 సెక్షన్ కింద టీడీఎస్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. 50 వేలుపైన అద్దె చెల్లిస్తే సెక్షన్ 1941బీ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంటి యజమాని టీడీఎస్ క్లెయిమ్ చేసుకుంటే ఆ మొత్తాన్ని ఎన్నారైలు తమ అద్దెలో నుంచి మినహాయించుకోవచ్చు. ఇక ఆదాయపు పన్ను చట్టం-1961లోని(IT Act) సెక్షన్ 6లో ఎన్నారై అంటే ఎవరనే అంశాన్ని స్పష్టంగా నిర్వచించారు. ఈ సెక్షన్ ప్రకారం..భారత్‌లో నివసించని భారత పౌరులు, భారత సంతతి వారిని ఎన్నారైలు అని అంటారు.

Updated Date - 2022-09-20T04:06:38+05:30 IST