బైడెన్ కోటుపై ఉన్నది పిట్ట రెట్ట కాదు.. క్లారిటీ ఇచ్చిన వైట్ హౌస్..!

ABN , First Publish Date - 2022-04-16T03:20:50+05:30 IST

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై పిట్ట రెట్ట వేసినట్టు ఇటీవల కాలంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై శ్వేతసౌధం తాజాగా క్లారిటీ ఇచ్చింది.

బైడెన్ కోటుపై ఉన్నది పిట్ట రెట్ట కాదు.. క్లారిటీ ఇచ్చిన వైట్ హౌస్..!

ఎన్నారై డెస్క్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై పిట్ట రెట్ట వేసినట్టు ఇటీవల కాలంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై శ్వేతసౌధం తాజాగా క్లారిటీ ఇచ్చింది. అది మొక్కజొన్న అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కేట్ బెడింగ్ ఫీల్డ్ అన్నారు. ‘‘మొక్కజొన్న నిల్వ ఉంచే ప్రదేశాలకు వెళితే మీకూ విషయం అర్థమవుతుంది’’ అని ఆమె కామెంట్ చేశారు.  అయితే.. ఐయోవా రాష్ట్రంలోని ఓ  బయోప్రాసెసింగ్‌ ప్లాంట్ వద్ద బైడెన్‌ ఇటీవల ఓ రోజు ప్రసంగిస్తున్న సమయంలో కోటు మీద ఈ మరకపడటంతో అది మొక్కజొన్న మరకలే అయి ఉండొచ్చని నెటిజన్లు కూడా అంగీకరిస్తున్నారు.

Updated Date - 2022-04-16T03:20:50+05:30 IST