YouTube: యూట్యూబ్‌‌లో వీడియోలు చూస్తున్నారా?.. మున్ముందు ఆ వీడియోలు ఫ్రీగా చూడడం కుదరకపోవచ్చు

ABN , First Publish Date - 2022-10-06T23:49:42+05:30 IST

టీవీ వంటి బిగ్‌స్ర్కీన్‌పై యూట్యూబ్ (Youtube) వీడియోలు చేస్తున్నారా?.. అయితే మీకు బ్యాడ్‌న్యూస్. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై అందరూ 4కే (4K) వీడియోలు చూడడం మున్ముందు సాధ్యపడకపోవచ్చు.

YouTube: యూట్యూబ్‌‌లో వీడియోలు చూస్తున్నారా?.. మున్ముందు ఆ వీడియోలు ఫ్రీగా చూడడం కుదరకపోవచ్చు

టీవీ వంటి బిగ్‌స్ర్కీన్‌పై యూట్యూబ్ (Youtube) వీడియోలు చూస్తున్నారా ?.. అయితే మీకిది బ్యాడ్‌న్యూస్. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌పై 4కే (4K) వీడియోలు చూడడం మున్ముందు అందరికీ సాధ్యపడకపోవచ్చు. ఈ ఫీచర్ యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్ర్కైబర్స్‌కు మాత్రమే పరిమితం చేసేందుకు యూట్యూబ్ కసరత్తు చేస్తోందని ‘లైవ్ హిందుస్తాన్’ రిపోర్టు పేర్కొంది.


కాగా ప్రీమియం సబ్‌స్ర్కైబన్ ప్లాన్‌లో  యాడ్-ఫ్రీ వీడియోస్, బ్యాక్‌గ్రౌండ్ వీడియో ప్లే వంటి ఆప్షన్లను యూజర్లు పొందొచ్చు. అంతేకాకుండా ఫ్రీ యూట్యూబ్ ప్రీమియం మ్యూజిక్‌ను పొందొచ్చు. ఆన్‌లైన్ చూసుకునేందుకు వీలుగా వీడియోలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  


ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్ ప్లాన్‌పై 4కే వీడియోస్ ప్లేబ్యాక్ అందించడంపై యూట్యూబ్ కసరత్తు చేస్తోందని రెడ్‌ఇట్ (Reddit) పోస్ట్ పేర్కొంది. అంటే ప్రీమియం సబ్‌స్ర్కైబర్లు మాత్రమే మెరుగైన రిజుల్యూషన్ కలిగిన 4కే (2,160 పిక్సెల్స్) వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. యూజర్లలో మరింత మందిని ప్రీమియం యూజర్లగా మార్చుకోవాలని యూట్యూబ్ భావిస్తోందని రిపోర్ట్ పేర్కొంది. ఈ కారణంగానే వీడియోకి ముందు 12 స్కిప్ చేయాల్సిన వీడియోలను ప్లే చేయడాన్ని యూట్యూబ్ పరీక్షిస్తోందని పలు రిపోర్టులు చెబుతున్నాయి. భారత్‌లో యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ నెలకు రూ.129గా ఉంది. మ్యూజిక్, ప్రీమియం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 50 మిలియన్లు దాటిందని యూట్యూబ్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-10-06T23:49:42+05:30 IST