ఈ పండు రుచి చూడాలంటే భూములు అమ్ముకోవాల్సిందే.. కేజీ ధర విటే షాక్ అవుతారు..!

ABN , First Publish Date - 2021-11-07T21:33:05+05:30 IST

భూమి మీద చాలా రకాల పండ్లు ఉంటాయి. కొన్నింటి ధర ఎక్కువగా ఉన్నా.. కొనేందుకు వెనకాడం. వాటి వాటి ప్రాధాన్యత అనుగుంగా రేటు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పండు విలువ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.

ఈ పండు రుచి చూడాలంటే భూములు అమ్ముకోవాల్సిందే.. కేజీ ధర విటే షాక్ అవుతారు..!

భూమి మీద చాలా రకాల పండ్లు ఉంటాయి. కొన్నింటి ధర ఎక్కువగా ఉన్నా.. కొనేందుకు వెనకాడం. వాటి వాటి ప్రాధాన్యత అనుగుంగా రేటు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పండు విలువ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు. వాటిని కొనాలంటే భూములను అమ్ముకోవాల్సిందే. కోటీశ్వరులు కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి కొనే.. ఆ పండుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..


జపాన్‌లోని యుబారి ప్రాంతంలో లభించే యుబారి మెలన్ అనే పండు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది. సామాన్యులు కలలో కూడా కొనలేని ఈ పండును అక్కడి కోటీశ్వరులు మాత్రమే కొంటూ ఉంటారు. ఈ పండు చూడ్డానికి మాత్రం కర్బూజ పండు తరహాలో ఉంటుంది. ప్రస్తుతం కేజీ యుబారి కింగ్ పండ్ల ధర రూ.20లక్షలు పలుకుతోంది. దానికున్న ప్రత్యేకత కారణంగానే అంత రేటు పెట్టి కొంటూ ఉంటారు.


ఈ పండ్లను ఎక్కడపడితే అక్కడ కాకుండా గ్రీన్ హౌస్‌లలో ప్రత్యేక పద్ధతుల్లో పండిస్తారు. అందువల్లే వీటికి అంత డిమాండ్ ఉందట. రెస్టారెంట్ యజమానులు వీటిని విక్రయిస్తూ ఉంటారు. ధర ఎక్కువ కావడంతో ఐస్‌క్రీమ్ కప్పుల్లో నింపి విక్రయిస్తూ ఉంటారు. కోటీశ్వరులు వెళ్లే పెద్ద పెద్ద హోటళ్లలో మాత్రమే ఇవి కనపడుతుంటాయి. సామాన్యులు వీటిని చూడడం తప్ప.. కొనే సాహసం చేయరు.

Updated Date - 2021-11-07T21:33:05+05:30 IST