నన్నే మాస్కు పెట్టుకోలేదని అడుగుతావా... అంటూ ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు..

Published: Mon, 10 Jan 2022 21:36:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
నన్నే మాస్కు పెట్టుకోలేదని అడుగుతావా... అంటూ ఆ వ్యక్తి చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు.. ప్రతీకాత్మక చిత్రం

కరోనా వచ్చినప్పటి నుంచి మాస్కు తప్పనిసరి అనే విషయం తెలిసిందే. మాస్కు లేకుండా బయటికి వెళ్లలేని పరిస్థితి. ఎన్ని నిబంధనలు పెట్టినా కొందరు మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. మాస్కులు లేకుండా దర్జాగా తిరుగుతుంటారు. తీరా పోలీసులకు దొరికి జరిమానాలు కట్టే వరకూ తెచ్చుకుంటారు. ఢిల్లీలో ఓ వ్యక్తి మాస్కు పెట్టుకోకుండా బయటికి రావడమే కాకుండా.. ప్రశ్నించిన పోలీసులకు చుక్కలు చూపించాడు. గత శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా .. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. కరోనా ఆంక్షల్లో భాగంగా ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. పట్‌పర్‌గంజ్ ఎక్స్‌టెన్షన్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన భార్య, బంధువులతో కలిసి శనివారం అర్ధరాత్రి కారులో వస్తున్నాడు. సీమాపురి గోల్చక్కర్ సమీపంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ కారును ఆపాడు. మాస్కులు పెట్టుకోవాలంటూ సూచించాడు. దీంతో కారు యజమాని ఒక్కసారిగా పోలీసుపై ఫైర్ అయ్యాడు.

పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి.. ఏడాది తర్వాత అనుకోని ఘటన.. చివరకు కొడుకుతో సహా భార్య ఏం చేసిందంటే..

నన్నే మాస్కు పెట్టుకోమని అడుగుతావా... అంటూ చిందులేశాడు. అతడి భార్య కూడా కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతలో మరో కానిస్టేబుల్ అక్కడికి రావడంతో గొడవ మరింత పెద్దదైంది. వారి మధ్య వాగ్వాదం జరుగుతున్న క్రమంలో కారు యజమాని ఒక్కసారిగా జేబులో నుంచి లైసెస్డ్ ఫిస్టల్ బయటికి తీశాడు. వెంటనే నేలకేసి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. అనంతరం అతడిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

నీతో ఓ మాట చెప్పాలంటూ భార్యను తీసుకెళ్లిన భర్త.. చివరగా అతను చెప్పిన మాటలు విని.. ఆమె మైండ్ బ్లాక్..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

అటవీ ప్రాంతంలో, గడ్డకట్టే చలిలో.. పురిటినొప్పులతో గర్భిణి అవస్థలు.. ఇంతలో వారంతా గుంపులుగా వచ్చి..videoViral Video: ఈ కుక్కల వాలీబాల్ గేమ్ మామూలుగా లేదుగా.. అచ్చం మనుషుల్లాగే ఆడుతున్నాయే.. videoఫొటోలు చూసి యువతులను సెలెక్ట్ చేసుకోవాలట.. మనిషికో రేటు కట్టేశారు.. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగానే..లూడో గేమ్ వేదికగా.. రాజస్తానీ మహిళ, పాకిస్తాన్ యువకుడి ప్రేమాయణం.. భర్త, రెండేళ్ల బాబును వదిలి వెళ్తుండగా.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఒక్క విషయంలో ప్రజలు ఎగతాళి చేస్తున్నారని.. భార్యతో ఇలా అనడంతో..భర్తను వదిలి తల్లిదండ్రుల వద్ద ఉంటూ.. ఇటీవల ఆస్పత్రికి వెళ్లి ఆమె చేసిన నిర్వాకం.. భర్తకు తెలియడంతో..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.