వ్యాక్సీన్ తీసుకోండి..ఇవన్నీ ఫ్రీగా అందుకోండి..

ABN , First Publish Date - 2021-10-08T16:29:06+05:30 IST

ఇలా వ్యాక్సిన్ వేయించుకో...అలా వాషింగ్ మిషన్, వెట్ గ్రైండర్, మిక్సీ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్..

వ్యాక్సీన్ తీసుకోండి..ఇవన్నీ ఫ్రీగా అందుకోండి..

కరూర్: ఇలా వ్యాక్సిన్ వేయించుకో...అలా వాషింగ్ మిషన్, వెట్ గ్రైండర్, మిక్సీ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్ నీ సొంతం చేసుకో..అంటోంది కరూర్ జిల్లా యంత్రాగం. ఆదివారంనాడు జరగనున్న మెగా వ్యాక్సిన్ క్యాంపులో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కరూర్ కలెక్టర్ టి.ప్రభు శంకర్ ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఎక్కువ మందిని వ్యాక్సినేషన్‌ వైపు ఆకర్షించేందుకు ఈ ఛాన్స్ కల్పించామని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు 18 ఏళ్లు నిండిన వారికి వారం వారం ఈ మెగా వ్యాక్సినేషన్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇది కరూర్‌లో వరుసగా ఇదో వారం నిర్వహిస్తున్న క్యాంప్‌ అని తెలిపారు.


వ్యాక్సినేషన్‌కు ఎంతమందిని తీసుకువస్తే అన్ని ఐదు రూపాయలు చొప్పున వలంటీర్‌కు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఆదివారం జరిపే మెగా వ్యాక్సినేషన్ క్యాంపులో వ్యాక్సిన్ వేయించుకున్న వారి కోసం డ్రా కూడా నిర్వహించనున్నారు. తొలి బహుమతిగా వాషింగ్ మిషన్, రెండో బహుమతి వెట్ గ్రైండర్, మూడో బహుమతిగా మిక్సీ గ్రైండర్స్ ప్రదానం చేస్తారు. నాలుగో బహుమతిగా 25 మందికి ప్రెషర్ కుక్కర్లు ఇస్తారు. కన్సొలేషన్ బహుమతిగా 100 మందికి వంటపాత్రలు ఇస్తారు. 25 మందికి పైగా వ్యక్తులను తీసుకువచ్చిన వలంటీర్ల పేర్లను కూడా లక్కీ డ్రాలో చేరుస్తారు.

Updated Date - 2021-10-08T16:29:06+05:30 IST