ఇకపై మీ ఇంటి పేరు విషయంలో ఈ నిబంధనలు పాటించాల్సిందే.. కోర్టు ఏమంటోందంటే..

ABN , First Publish Date - 2022-04-28T14:18:13+05:30 IST

మీ ఇంటి పేరు?.. అని అడగ్గానే టక్కున తండ్రి గుర్తుకొస్తాడు. తండ్రి ఇంటి పేరునే పిల్లలకు కొనసాగించడం ఎప్పటినుంచో వస్తోంది. అంతెందుకు కేవలం ఇంటి పేరు...

ఇకపై మీ ఇంటి పేరు విషయంలో ఈ నిబంధనలు పాటించాల్సిందే.. కోర్టు ఏమంటోందంటే..

మీ ఇంటి పేరు?.. అని అడగ్గానే టక్కున తండ్రి గుర్తుకొస్తాడు. తండ్రి ఇంటి పేరునే పిల్లలకు కొనసాగించడం ఎప్పటినుంచో వస్తోంది. అంతెందుకు కేవలం ఇంటి పేరు కొనసాగుతూ ఉండాలనే ఉద్దేశంతోనే కొడుకులు ఉండాలి అని భావించే తండ్రులు ఎంతో మంది ఉంటారు. కూతురు పుడితే తమ ఇంటి పేరు కొనసాగదనే ఉద్దేశంతో బాధపడుతూ ఉంటారు. అదే కొడుకు పుడితే వంశోద్ధారకుడు అంటూ మురిసిపోతారు. కానీ ఈ విషయంలో నవమాసాలు మోసి, కని పెంచిన తల్లికి మాత్రం అంత స్థానం ఉండదు. అందుకే ఈ అంశంపై ఇటలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది...


ఇటాలియన్ పిల్లలకు.. నవజాత శిశువుగా ఉన్న సయంలోనే తండ్రి ఇంటి పేరును చేరుస్తారు. అయితే ఈ సంప్రదాయాన్ని రద్దు చేస్తూ  ఇటలీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి ఇంటి పేరును మాత్రమే పెట్టడం వివక్షతకు గురిచేయడమే అని భావించింది. తల్లిదండ్రుల ఇద్దరి ఇంటి పేర్లనూ చేర్చాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ఈ చట్టాన్ని అమలయ్యేందుకు పార్లమెంట్‌లో తమ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆ దేశ మంత్రి ఎలెనా బోనెట్టి.. సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని, దీని ద్వారా పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఇద్దరికీ సమాన బాధ్యత ఉంటుందని పేర్కొంది. ఇదిలావుండగా, ఇటలీలో జననాల రేటు తగ్గుతుండడంపై పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల పోషణ భారం ఎక్కువవడం కూడా ఇందుకు కారణం కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

ఫొటోను చూసే అవాక్కవుతున్నారా..? ఈ King Cobra వీడియోను చూస్తే..

Updated Date - 2022-04-28T14:18:13+05:30 IST