ITBP jawan arrested:మైనర్ బాలికపై ఐటీబీపీ జవాన్ అత్యాచారం...గర్భం దాల్చిన బాలిక

ABN , First Publish Date - 2022-08-08T14:00:37+05:30 IST

ఓ మైనర్ బాలికపై ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు జవాన్(ITBP jawan) అత్యాచారం చేసిన ఘటన...

ITBP jawan arrested:మైనర్ బాలికపై ఐటీబీపీ జవాన్ అత్యాచారం...గర్భం దాల్చిన బాలిక

గ్యాంగ్‌టక్ (సిక్కిం): ఓ మైనర్ బాలికపై ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు జవాన్(ITBP jawan) అత్యాచారం చేసిన ఘటన సిక్కింలోని(Sikkim) పాకియాంగ్ జిల్లాలో జరిగింది. రంగపో పట్టణానికి చెందిన ఐటీబీపీ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ తన రాజ్‌భవన్ శీతాకాల క్యాంపు క్వార్టరులో 13 ఏళ్ల మైనర్ బాలికపై పలుసార్లు అత్యాచారం చేసి గర్భవతిని(pregnant) చేశాడు. తన మైనర్ కుమార్తెపై ఐటీబీపీ ఏఎస్ఐతోపాటు(paramilitary personnel an assistant sub-inspector) స్థానిక యువకుడు ఏప్రిల్ నెల నుంచి పలుసార్లు అత్యాచారం జరిపి గర్భవతిని చేశారని  బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


 దీంతో పోలీసులు దీనిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి(Police booked) నిందితులైన ఐటీబీపీ ఏఎస్ఐ, స్థానిక యువకుడిని అరెస్టు(arrested) చేశారు. బాలికకు రంగ్ పో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యపరీక్షలు చేశారు.బాలికపై అత్యాచారం చేసిన ఐటీబీపీ ఏఎస్ఐ, స్థానిక యువకుడికి మధ్య ఉన్న సంబంధాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


Updated Date - 2022-08-08T14:00:37+05:30 IST