గిరిజన నిరుద్యోగులతో ఐటీడీఏ అధికారులు చెలగాటం

ABN , First Publish Date - 2021-03-08T22:58:22+05:30 IST

గిరిజన నిరుద్యోగులతో ఐటీడీఏ అధికారులు చెలగాటం ఆడారు. గురుకుల

గిరిజన నిరుద్యోగులతో ఐటీడీఏ అధికారులు చెలగాటం

విశాఖ: గిరిజన నిరుద్యోగులతో ఐటీడీఏ అధికారులు చెలగాటం ఆడారు. గురుకుల పాఠశాల, కళాశాలలో ఏకలవ్య పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను ఐటీడీఏ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం పాడేరు గురుకుల కళాశాలలో పరీక్ష నిర్వహించారు. ఉదయం 9 గంటలకు 1,000 మంది గిరిజన నిరుద్యోగులు రాతపరీక్షకు హాజరయ్యారు. అయితే సమయం గడుస్తున్నా అభ్యర్థులకు ప్రశ్నాపత్రం ఇవ్వలేదు. పరీక్ష ప్రశ్నావళి ఇంకా రాలేదని, ప్రశ్నాపత్రం రావడానికి మరికొంత సమయం పడుతుందంటూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు మండుటెండలో నిరుద్యోగులను అధికారులు నిలబెట్టారు. 


అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. దీంతో ఐటీడీఏ వద్ద అభ్యర్థులు ఆందోళన చేశారు. పరీక్ష ప్రశ్నావళి ప్రతులను జిరాక్సులు తీస్తున్నామని నిరుద్యోగులకు గిరిజన సంక్షేమ డిప్యూటీ డైరెక్టర్ విజయకుమార్ తెలిపారు. సాయంత్రం లోపు పరీక్ష నిర్వహిస్తామని నిరుద్యోగులకు విజయకుమార్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో  పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు నిరసన తెలిపారు. 

Updated Date - 2021-03-08T22:58:22+05:30 IST