ఐటీడీఏ పీవో సూర్యనారాయణరెడ్డి బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2022-05-20T06:09:13+05:30 IST

కేఆర్‌ పురం ఐటీడీఏ ప్రాజె క్టు ఆఫీసర్‌గా పోలవరం ప్రాజెక్టు ప్రధాన కుడి కాల్వ ప్రత్యేక భూసేకరణ అధికారి జి.సూర్యనారాయణరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ఐటీడీఏ పీవో సూర్యనారాయణరెడ్డి బాధ్యతల స్వీకరణ
బాధ్యతలు స్వీకరిస్తున్న పీవో

బుట్టాయగూడెం, మే 19 : కేఆర్‌ పురం ఐటీడీఏ ప్రాజె క్టు ఆఫీసర్‌గా పోలవరం ప్రాజెక్టు ప్రధాన కుడి కాల్వ ప్రత్యేక భూసేకరణ అధికారి జి.సూర్యనారాయణరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. గురువా రం ఆయన ఇన్‌చార్జీ పీవోగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పనిచేసిన ఇ.మురళి బదిలీ కావడంతో ఆయన స్థానంలో సూర్యనారాయణరెడ్డికి అదనపు బాధ్య తలను అప్పగించారు. ఆర్వీ సూర్యనారాయణ సస్పెండ్‌ తర్వాత ఇప్పటి వరకు నలుగురు అధికారులు ఇన్‌చార్జ్‌లుగా పని చేశారు. మురళి నాలుగు రోజులు మాత్రమే పీవోగా ఉండగా.. ప్రస్తుత పీవో ఎన్ని రోజులు ఉంటారోనని గిరిజనులు చర్చించుకోవడం గమనార్హం. పీవోను ఐటీడీఏ సిబ్బంది మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ప్రతి బుధవారం జరిగే గిరిజన దర్భార్‌కు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.


Updated Date - 2022-05-20T06:09:13+05:30 IST