జాడలు లేకుండా..నయీం ముఠాపై పోలీసుల ఉక్కుపిడికిలి

ABN , First Publish Date - 2020-08-08T10:09:47+05:30 IST

బెదిరింపులు, బలవంత పు వసూళ్లు, కిడ్నా్‌పలు, హత్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..

జాడలు లేకుండా..నయీం ముఠాపై పోలీసుల ఉక్కుపిడికిలి

 గ్యాంగ్‌స్టర్‌ అంతమై నేటికి నాలుగేళ్లు  

 న్యాయం కోసం బాధితుల ఎదురుచూపు  

 లోక్‌పాల్‌ చట్టం కింద విచారణకు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ డిమాండ్‌


యాదాద్రి, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): బెదిరింపులు, బలవంత పు వసూళ్లు, కిడ్నా్‌పలు, హత్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కర్ణాటక, మహారాష్ట్ర, గోవాలో సైతం చీకటి నేరసామ్రాజ్యాన్ని నడిపిన గ్యాంగ్‌స్టర్‌ నయీముద్దీన్‌ అంతమై నేటికిసరిగ్గా నాలుగేళ్లు. యాదా ద్రి జిల్లా భువనగిరికి చెందిన నయీం, అనుచరుల ఆగడాలతో భయాందోళనలకు గురైన ఉమ్మడి జిల్లా వాసులతోపాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతవాసులు ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే నయీం హతమయ్యాక అతడి కుటుంబ సభ్యులు, అనుచరుల ఆగడాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ పీడీ యాక్టులు నమోదు చేశారు. రౌడీ షీట్ల పరంపర కొనసాగించారు. నయీం జాడలు లేకుండా కట్టుదిట్ట చర్యలు తీసుకున్నారు. పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి. అయితే ఈ ముఠా చేతిలో విలువైన ఆస్తులు కోల్పోయిన బాధితులు న్యాయం కోసం కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ కేసుల్లో కొంతమంది రాజకీయ నాయకులు, పోలీస్‌ అధికారులకు ప్రమేయం ఉన్నందున లోక్‌పాల్‌ చట్టం కింద విచారించాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కోరుతోంది.


అంతరాష్ట్రాల స్థాయిలో రెండు దశాబ్దాలపాటు గ్యాంగ్‌స్టర్‌ న యీం సాగించిన చీకటి రాజ్యం 2016, ఆగస్టు8న పతనమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌ సమీపంలోని మిలీనియం టౌన్‌షి్‌ప వద్ద గ్రేహౌండ్స్‌ బలగాల చేతిలో నయీం ఎన్‌కౌంటర్‌ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతడితో సంబంధాలు నెరపిన, నేరాల్లో పాల్గొన్న కుటుంబసభ్యులు, అనుచరులు జైళ్లపాలయ్యారు. మొత్తం 250కేసులు నమోదుకాగా, 124 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అతడి తల్లి, భార్య, సోదరితో పాటు సమీప కుటుంబసభ్యులు ఉన్నారు. 107 కేసుల్లో పోలీసులు చార్జీషీట్లు దాఖలు చేశారు. మరో ఎనిమిది కేసుల్లో విచారణ పూర్తయింది. 10 కేసులను మూసివేశారు. 17 కేసులు విచారణ పూర్తయి చార్జీషీట్‌కు సిద్ధంగా ఉన్నాయి. నయీం నేరాల్లో పా ల్గొన్న అతడి మేనకోడలు షాహిదా ఈ ఏడాది జనవరి మాసంలో నల్లగొండ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. నయీం అనుచరులపై పీడీ యాక్టులు కొనసాగుతున్నాయి.


లోక్‌పాల్‌ చట్టం కింద విచారించాలి 

నయీం ముఠా సాగించిన ఆగడాలను మౌనంగా భరించిన బాధితులు అతడి ఎన్‌కౌంటర్‌ తర్వాత పెద్దసంఖ్యలో ముందుకువచ్చి సాక్షాధారాలతో పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఈ కేసుల్లో పోలీసు అధికారులు, రాజకీయ నాయకులకు ప్రమేయం ఉన్నందున లోక్‌పాల్‌ చట్టం కింద విచారణ చేయాలని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కోరుతోంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం నుంచి కేసులు, స్వాధీనం చేసుకున్న ఆస్తుల వివరాలను లోక్‌పాల్‌కు సైతం ఈ ఏడాది జూన్‌లో సమర్పించింది. నయీం హతయ్యాక అతడి నుంచి రూ.2.16కోట్ల నగదు, 1015 ఎకరాల భూములు, 1లక్ష 67 వేల చదరపు గజాల ఇళ్ల స్థలాలు, బంగారం, వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్నుల శాఖ నయీం, అతడి కుటుంబసభ్యులు, బినామీ ఆస్తుల వివరాలు సేకరించి ఇప్పటికే మూడుపర్యాయాలు నోటీసులు జారీ చేసింది. భు వనగిరి పట్టణ శివారులో ఇళ్లస్థలాలకు సంబంధించిన కేసు ఆర్డీవో కోర్డులో విచారణ కొనసాగుతోంది. నయీం ఆగడాలతో ఆస్తులు కోల్పోయిన బాధితులు న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు. 

Updated Date - 2020-08-08T10:09:47+05:30 IST