బడికి వేళాయె..

ABN , First Publish Date - 2021-01-12T05:07:03+05:30 IST

కరోనా మహమ్మారి కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో గత ఏడాది మార్చి 21 నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు మూతపడ్డాయి. 2019-20 విద్యాసంవత్సరంలో వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరిని ఉత్తీర్ణు లు చేసి ఉన్నత చదవులకు ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది.

బడికి వేళాయె..

ఫిబ్రవరి 1 నుంచి తెరుచుకోనున్న విద్యాసంస్థలు 

 సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ 

 తొమ్మిది నుంచి ఆపై తరగతుల నిర్వహణకు ఉత్తర్వులు

 ఇక ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ తరగతుల నిర్వహణ 


కరీంనగర్‌ టౌన్‌, జనవరి 11: కరోనా మహమ్మారి  కనీవినీ ఎరుగని రీతిలో ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. దీంతో గత ఏడాది మార్చి 21 నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు మూతపడ్డాయి. 2019-20 విద్యాసంవత్సరంలో వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరిని ఉత్తీర్ణు లు చేసి ఉన్నత చదవులకు ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. వి ద్యార్థులు, ఉపాధ్యాయులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మఽ ద్యాహ్న భోజన పథకం అటకెక్కింది. ఈ నేపథ్యంలో 2020-21 విద్యాసంవత్సరంలోనైనా పరీక్షలు నిర్వహించి విద్యా వ్యవస్థను గాడినపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ విద్యాబోధనకు శ్రీకారం చుట్టినప్పటికి అంతంత మాత్రంగానే సాగింది. కరోనా ఇప్పట్లో పోయేటట్లు లేదని, పాఠశాలలు, కళాశాలలు తెరిచే పరిస్థితి లేదని, గత విద్యాసంవత్సరం మాదిరిగానే ప్రస్తుత సం వత్సరంలో కూడా వార్షిక పరీక్షలు నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదని ప్రచారం జరిగింది. సంక్రాంతి పండగ తర్వాత ఈ నెల 18 నుంచి స్కూల్స్‌, కాలేజీలను తెరుస్తారని, ఈమేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే మరో ప్రచారం జరిగింది. 


 ఎట్టకేలకు..


ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి తొమ్మిదో తరగతి నుంచి ఆపై పది, ఇంటర్మీడియట్‌, డిగ్రీతోపాటు వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన కళాశాలలన్నిటిని పునః ప్రా రంభించి, తరగతులను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. సోమవారం హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రులు, కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 1 నుంచి విద్యా సంస్థలను తెరవాలని ఆదేశించారు. హాస్టళ్లను కూడా తెరువాలని ఆదేశించడంతో మంగళవారం నుంచి పాఠశాలలు, హాస్టళ్లను శుభ్రం చేసే పనులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 27 నుంచి ఉపాధ్యాయులు పాఠశాలలకు వెళ్లి ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. వారంలో మూడు రోజులు విధులకు హాజరవుతున్నారు. సెప్టెంబరు 11 నుంచి ఆన్‌లైన్‌ విద్యాబోధన ప్రారంభమైంది. మొదట్లో సవ్యంగానే జరిగినా ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌ సమస్య, టీవీలు, విద్యుత్‌ సరఫరా లేక పోవడం వంటి సాంకేతిక కారణాలతో అంతంత మాత్రంగానే ఆన్‌లైన్‌ విద్యాబోధన జరిగింది. ఇక ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలకు పూర్వవైభవం రానున్నది. 


ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు 


 కరోనా వైరస్‌ కొత్త రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్‌ విద్యాబోధన చేయాలని, పరీక్షలు లేకుండానే అప్‌ గ్రేడ్‌ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెజార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఉపాధ్యాయులు మా త్రం పాఠశాలలు, కళాశాలలు తెరిస్తేనే బాగుంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1నుంచి విద్యాసంస్థలకు విద్యార్థులు తప్పనిసరిగా రావాలని,  రాలేని వారు ఆన్‌లైన్‌ విద్యాబోధన ద్వారా చదువుకోవాలని సూచిస్తున్నారు.  10 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు ఫిబ్రవరి 1 నుం చి తెరుచుకోనున్నాయి. జిల్లాలో 710 ప్రభుత్వ ప్రై వేట్‌ పాఠశాలలు ఉండగా వాటిలో 50,711 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 9, 10 తరగతులకు చెందిన వారు దాదాపు ఐదు వేల మంది వరకు ఉన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నికల్‌, ఐటీ ఐ వంటి టెక్నికల్‌ కళాశాలల్లో మరో ఐదు వేల మంది వరకు వివిధ కోర్సుల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. 


ట్రస్మా, హాస్టల్‌ నిర్వాహకుల హర్షం  


ప్రభుత్వం పాఠశాలు, కళాశాలలను ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీచేయడంపై ట్రస్మా, ఇతర సంస్థలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. హాస్టల్‌ నిర్వాహకులు, ప్రభుత్వ ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. 

Updated Date - 2021-01-12T05:07:03+05:30 IST