బతుకంతా రాసిచ్చినట్టే!

Published: Mon, 08 Aug 2022 00:36:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బతుకంతా రాసిచ్చినట్టే!

పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లైగర్‌’. విజయ్‌ దేవరకొండ కథానాయకుడు. అనన్య పాండే నాయిక. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈనెల 25న విడుదల అవుతోంది. ఇటీవల ‘ఆఫత్‌’ గీతాన్ని విడుదల చేశారు. భాస్కరభట్ల రవికుమార్‌ రాసిన పాట ఇది. సింహా, శ్రావణ భార్గవి ఆలపించారు. ‘మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అంటూ ఈ పాటని విజయ్‌ దేవరకొండ అభివర్ణించారు. అన్నట్టుగానే విజయ్‌, అనన్యల కెమిస్ర్టీ ఆకట్టుకుంటోంది. ‘‘బాబోయ్‌ మామూలు డ్రామాలు కావు. అన్నీ లెక్కలేసుకొని నువ్వు బకరా అని ఫిక్సయిన తరవాత నెంబర్‌ ఇస్తయ్‌.. ఇక నీ బతుకంతా వాళ్లకు రాసిచ్చినట్టే’’ అంటూ సాగే రమ్యకృష్ణ డైలాగులతో ఈ పాట మొదలైంది. బాక్సింగ్‌ నేపథ్యంలో నడిచే ఈ చిత్రంలో మైక్‌ టైసన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మాతలు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International