నేను కోవిషీల్డ్ మూడో డోసు తీసుకున్నా: ‘సీరం’ వ్యవస్థాపకుడు

Aug 18 2021 @ 20:26PM

ముంబై: కోవిషీల్డ్ కరోనా టీకా సాధారణంగా రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే.. టీకాతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు కొంతకాలం తరువాత తగ్గిపోతాయని ఇటీవల జరిగిన కొన్ని శాస్త్రీయమైన అధ్యయనాలు తేల్చాయి.  దీంతో.. బూస్టర్ డోసులు తీసుకోవాలనే వాదన తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ ఎస్ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికే కోవిషీల్డ్ మూడో డోసు తీసుకున్నానని వెల్లడించారు. యాంటీబాడీలు తగ్గుతుండటంతోనే తాను మూడో డోసు తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. సీరం సంస్థలోని దాదాపు 8 వేల మంది ఉద్యోగులకు కూడా మూడో డోసు ఇచ్చామని తెలిపారు. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత మూడో డోసు తీసుకోవాలంటూ ఆయన ప్రజలకు సూచించారు. ఓ జాతీయ వార్తాసంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.