
న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ తయారుచేసిన సింగిల్ డోస్ కరోనా వ్యాక్సీన్ వచ్చే నెలలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలున్నాయి. భారత్‌లో ఈ వ్యాక్సీన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఉత్పత్తిచేస్తోంది. గత నెలలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీఐజీ) ఈ వ్యాక్సీన్ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.
కరోనాను అదుపులోకి తెచ్చేందుకు భారత్‌లో ఇప్పుడు ఐదు అత్యవసర వ్యాక్సీన్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో తొలిసారిగా కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల వినియోగానికి అనుమతినిచ్చారు. ఆ తరువాత స్పుత్నిక్ వీ, మోడెర్నా వ్యాక్సీన్, జైడస్ కాడిలాకు చెందిన జికోవిడ్ టీకాలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇప్పుడు జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకాకు అనుమతి లభించింది. కాగా జే అండ్ జే వ్యాక్సిన్ కరోనాపై పోరాటంలో 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని తేలింది.