నిజాయతీకి నిలువుటద్దం జేఆర్‌ పుష్పరాజ్‌

ABN , First Publish Date - 2022-08-08T06:03:58+05:30 IST

నీతి, నిజాయతీకి నిలువుటద్దం, నిబద్ధతకు మారు పేరు మాజీ మంత్రి జేఆర్‌ పుష్ఫరాజ్‌ అని పలువురు ప్రముఖులు కొనియాడారు.

నిజాయతీకి నిలువుటద్దం  జేఆర్‌ పుష్పరాజ్‌
పుష్పరాజ్‌ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ప్రత్తిపాటి పుల్లారావు, తదితరులు

సంస్మరణ సభలో కొనియాడిన ప్రముఖులు

గుంటూరు,ఆగస్టు7 (ఆంధ్రజ్యోతి): నీతి, నిజాయతీకి నిలువుటద్దం, నిబద్ధతకు మారు పేరు మాజీ మంత్రి జేఆర్‌ పుష్ఫరాజ్‌ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. నగరంపాలెం కమ్యూనిటీ హాల్లో పుష్పరాజ్‌ ఆదివారం సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు హాజరై పుష్పరాజ్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో వారు మాట్లాడుతూ పుష్పరాజ్‌ వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, అలాంటి వ్యక్తుల జీవితాలను, ఆదర్శాలను భావితరాలకు అందించడం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ముందుగా ఫాస్టర్లు ఏలియా, జోసఫ్‌, అబ్రహం లింకన్‌లు ప్రత్యేయ ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, డొక్కా మాణిక్య వరప్రసాద్‌, టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, నన్నపనేని రాజకుమారి, రాయపాటి శ్రీనివాస్‌, తెనాలి శ్రావణ్‌కుమార్‌, డిప్యూటీ మేయర్‌ సజల, అధికారులు దయాసాగర్‌, ఎలీషా, మల్లిఖార్జునరావు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పుష్పరాజ్‌ సోదరుడు ఐఏఎస్‌ అధికారి, పశ్చిమ బెంగాల్‌ సీఎస్‌ సుందర్‌శేఖర్‌ వందన సమర్పణ చేశారు.

Updated Date - 2022-08-08T06:03:58+05:30 IST