చెన్నైతో జడేజా కటీఫ్‌?

ABN , First Publish Date - 2022-08-16T10:09:12+05:30 IST

ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)తో రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌..

చెన్నైతో జడేజా కటీఫ్‌?

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)తో రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ దాదాపుగా ముగిసిందనే చెప్పుకోవాలి. గత మేలో లీగ్‌ ముగిసిన తర్వాతి నుంచి ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌తో జడేజా టచ్‌లో లేడని సమాచారం. వచ్చే సీజన్‌లో అతడు సీఎ్‌సకేకు ఆడడం కష్టమనే వార్తలు వస్తున్నాయి. లీగ్‌ మధ్యలో కెప్టెన్సీ నుంచి తనను తప్పించి అవమానించారని జడేజా భావిస్తున్నట్టు సమాచారం. అందుకు చెన్నైతో తెగదెంపులు చేసుకోవడానికే అతడు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. 

Updated Date - 2022-08-16T10:09:12+05:30 IST