బాధ్యతలు స్వీకరిస్తున్న ఏఎస్పీ జగదీశ్
చిత్తూరు, మే 25: జిల్లా అడిషనల్ ఎస్పీ(అడ్మిన్)గా బుధవారం జగదీశ్ బాధ్యతలు స్వీకరించారు. ఉదయం ఆయన తన ఛాంబర్‌లో పూజలు చేసిన అనంతరం బాధ్యతలు తీసుకున్నారు. 2017 బ్యాచ్‌కు చెందిన ఈయన గ్రేహౌండ్స్ విభాగం పాడేరులో పనిచేశారు. అనంతరం ఆయన మర్యాద పూర్వకంగా ఎస్పీ రిషాంత్‌రెడ్డిని కలిశారు. ఇక్కడ ఏఎస్పీగా ఉన్న డీఎన్ మహేష్ గుంటూరు ఎస్‌ఈబీ ఏఎస్పీగా బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.