
నల్లగొండ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్ల కాలంలో మోదీ చేసిందేమిటో... తెలంగాణలో కేసీఆర్ చేసిందేమిటో ప్రజలు ఆలోచించాలన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి ప్రజల ఆదాయం తుంచేసింది బీజేపీయేనన్నారు. చచ్చిన పాము కాంగ్రెస్ అని... ఆ పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. తాచుపాములా కాటేసేందుకు వస్తున్న బీజీపీ గురించి ఆలోచించాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.