
రేపల్లె: సీఎం జగన్ కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ నటుడు పవన్ కల్యాణ్ సినిమాలపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లు, కాపు భవన్లు నిలిపివేస్తున్నట్లుగానే పవన్ కల్యాణ్ సినిమాను కూడా నిలిపివేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి కానీ ఏ సినిమాకి లేని ఆంక్షలు ఒక్క పవన్ కల్యాణ్ సినిమాకు మాత్రమే ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క పవన్ కల్యాణ్‌ను ఇబ్బంది పెట్టేందుకు వేలాది మంది సినిమా కార్మికుల జీవితాల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాపులకు పెద్దపీట వేస్తే జగన్‌రెడ్డి కత్తిపీట వేశారని దుయ్యబట్టారు. కాపు కార్పొరేషన్‌ను అలంకారప్రాయంగా మార్చి కాపు యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా అన్యాయం చేశారని అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి