
హైదరాబాద్: నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు సోమవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు గత గురువారం ఏపీ సీఎంకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. 28న (సోమవారం) కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజుర్నగర్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ వైఎస్ జగన్, శ్రీకాంత్ రెడ్డి, నాగిరెడ్డిపై ఈసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే అభియోగాన్ని పరిశీలించిన న్యాయస్థానం ఈ మేరకు సమన్లు జారీ చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యేక న్యాయస్థానం సీఎంగా ఉన్న నేతకు సమన్లు జారీ చేయడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి