Advertisement

జగన్‌ గ్యాంగ్‌ ఆర్థిక నేరాలు!

Mar 6 2021 @ 03:47AM

విదేశీ సంస్థల నుంచి ఫిర్యాదులు

ఈసారి చంచల్‌గూడ కాదు... విదేశీ జైలే!

కేసుల మాఫీ కోసమే ఢిల్లీలో పాద పూజలు

ట్విటర్‌ వేదికగా లోకేశ్‌ ధ్వజం


అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్‌ సన్నిహితులు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారంటూ కేంద్రానికి విదేశీ సంస్థల నుంచి ఫిర్యాదులు అందాయని వచ్చిన వార్తలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘‘ఢిల్లీ పెద్దల పాద పూజ రాష్ట్రం కోసం కాదు, కేసుల మాఫీ కోసమే అని తేలిపోయింది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తుంటే త్వరలోనే వైఎస్‌ జగన్‌, ఆయన డెకాయిట్‌ బ్యాచ్‌కు మరోసారి చిప్పకూడు ఖాయం అని స్పష్టమవుతోంది. ఈసారి ఏకంగా విదేశీయులు, జగన్‌రెడ్డి గ్యాంగ్‌ అర్థిక నేరాలపై ఫిర్యాదు చేశారు. ఇక చంచల్‌గూడ కాదు... విదేశీ జైలే’’ అని లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. జగన్‌ అత్యంత సన్నిహితుల ఆర్థిక అక్రమాలపై విదేశీ సంస్థలు కేంద్రానికి ఫిర్యాదు చేశాయని... దీనిపై అంతర్గత దర్యాప్తు ప్రారంభమైందని ‘రిపబ్లిక్‌ టీవీ’ వెల్లడించింది. జగన్‌ను ఇబ్బందులు చుట్టుముడుతున్నాయని వ్యాఖ్యానించింది.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.