అలిపిరి దగ్గర గోమందిరాన్ని ప్రారంభించిన జగన్

ABN , First Publish Date - 2021-10-11T23:20:32+05:30 IST

బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ఉత్సవర్లకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి సోమవారం తిరుమలకు వచ్చారు.

అలిపిరి దగ్గర గోమందిరాన్ని ప్రారంభించిన జగన్

తిరుపతి: బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరపున ఉత్సవర్లకు పట్టువస్త్రాలు సమర్పించేందుకు సీఎం జగన్మోహన్‌రెడ్డి సోమవారం తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి రోడ్డు మార్గాన 3.30 గంటలకు బర్డ్‌ ఆస్పత్రికి చేరుకుని చిన్నపిల్లల ఆస్పత్రిని ప్రారంభించారు. సాయంత్రం 4 గంటలకు అలిపిరి మెట్ల మార్గాన్ని, నూతనంగా నిర్మించిన గోమందిరాన్ని ప్రారంభించారు. పద్మావతి అతిథిగృహంలో విశ్రాంతి తీసుకుని.. 5.50 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి పట్టువస్త్రాలను ఆలయంలోకి తీసుకెళ్లి అందజేస్తారు. గరుడ వాహనంపై స్వామిని దర్శించుకుని 7.15 గంటలకు పద్మావతి అతిథిగృహానికి చేరుకుని బస చేస్తారు. మంగళవారం ఉదయం 5.30 గంటలకు మరోసారి శ్రీవారిని  దర్శించుకుంటారు. 6.25 గంటలకు బూందీ పోటును ప్రారంభిస్తారు. అనంతరం అన్నమయ్య భవన్‌కు చేరుకుని టీటీడీ అమలుచేస్తున్న నూతన కార్యక్రమాలు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలుసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రైతు సాధికారక సంస్థతో టీటీడీ పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ)లో సీఎం సంతకం చేయనున్నారు. ఉదయం 9 గంటలకు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు. 

Updated Date - 2021-10-11T23:20:32+05:30 IST