
అమరావతి: ఆక్వా రంగంపై సీఎం జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో ఆక్వా రంగం సంక్షోభంలో ఉందని, ఆక్వా విద్యుత్ రాయితీలను తక్షణమే పునరుద్ధరించి.. ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో తగ్గించిన ఛార్జీలను రెట్టింపు చేశారని మండిపడ్డారు. జగన్ పాదయాత్రలో ఆక్వా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి