AP News: జగన్‌ మామా... జాబ్‌ ఎక్కడ?

ABN , First Publish Date - 2022-07-28T01:29:29+05:30 IST

జగన్‌ (Jagan) మామా.. జాబ్‌ ఎక్కడంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెలుగు యువత ఆధ్వర్యంలో బుధవారం వినూత్న నిరసన చేపట్టారు.

AP News: జగన్‌ మామా... జాబ్‌ ఎక్కడ?

టెక్కలి: జగన్‌ (Jagan) మామా.. జాబ్‌ ఎక్కడంటూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెలుగు యువత ఆధ్వర్యంలో బుధవారం వినూత్న నిరసన చేపట్టారు. జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు ఆధ్వర్యంలో ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దారి పొడుగునా కార్లు తుడుస్తూ, చెప్పులు కుడుతూ, ఇస్త్రీ చేస్తూ నిరసన గళం విప్పారు. అలాగే పాత జాతీయరహదారిపై ఓ దున్నపోతు మెడలో జగన్‌ బొమ్మను కట్టారు. జగన్‌ సర్కార్‌  జాబ్‌ క్యాలెండర్‌పై మాట తప్పిందని నిరసన తెలియజేశారు. అలాగే ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట తదితర పట్టణాల్లో కూడా నిరసనలు చేపట్టారు. 


Updated Date - 2022-07-28T01:29:29+05:30 IST