Srinu Mother Savitri: నా కుమారుడిని విడుదల చేయండి..

ABN , First Publish Date - 2022-07-22T02:38:33+05:30 IST

ఏ పాపం ఎరుగని తన కుమారుడిని విడుదల చేయమని కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి కన్నీరు పెడుతున్నారు. లేదంటే తనను కూడా చంపేయాలని...

Srinu Mother Savitri: నా కుమారుడిని విడుదల చేయండి..

కాకినాడ (Kakinada): ఏ పాపం ఎరుగని తన కుమారుడిని విడుదల చేయమని కోడి కత్తి శ్రీను తల్లి సావిత్రి కన్నీరు పెడుతున్నారు. లేదంటే తనను కూడా చంపేయాలని రోదిస్తోంది. తన కొడుకును తలుచుకుని ఏడవని రోజు లేదని వెక్కివెక్కి ఏడుస్తోంది. సీఎం జగన్ (Cm Jagan)‎కు వీరాభిమాని అయిన తన కుమారుడు శ్రీను ఎందుకు చంపాలని చూస్తాడని ప్రశ్నిస్తోంది. తన కుమారుడిని దయ చేసి వదిలేయాలని సావిత్రి వేడుకుంటున్నారు. 


కాగా జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై శ్రీను కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో శ్రీను ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇటీవల గోదావరి (Godavari) పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చాయి. ఈ సమయంలో శ్రీను తల్లికి ఎవరూ అండగా లేరు. శ్రీను బయట ఉంటే వృద్ధురాలైన ఆమెకు అండగా ఉండేవాడు. నాయకులెవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకును చూడాలని.. విడుదల చేయాలని సావిత్రి వేడుకుంటున్నారు. 





Updated Date - 2022-07-22T02:38:33+05:30 IST