అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ

ABN , First Publish Date - 2021-06-04T01:45:58+05:30 IST

తొమ్మిది రాష్ట్రాల సీఎంలకు జగన్‌ లేఖ రాశారు. వ్యాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్లపై సీఎం లేఖ రాశారు. ఏపీ సహా 9 రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచినా..

అన్ని రాష్ట్రాల సీఎంలకు జగన్ లేఖ

అమరావతి: అన్ని రాష్ట్రాల సీఎంలకు సీఎం జగన్‌ లేఖ రాశారు. వ్యాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్లపై సీఎం లేఖ రాశారు. ఏపీ సహా 9 రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్లు పిలిచినా.. ఒక్క బిడ్‌ కూడా రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో టీకాల లభ్యత విషయంలో ఉన్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్నీ రాష్ట్రాల సీఎంలు ఒకే గొంతుక వినిపించాలని కోరారు. వ్యాక్సిన్ కోసం గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క టెండర్ కూడా దాఖలు కాలేదని కేరళ సీఎం విజయన్‌కు రాసిన లేఖలో జగన్ స్పష్టం చేశారు. గ్లోబల్ టెండర్లు ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖలో ప్రస్తావించారు. వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు అన్నట్లుగా పరిస్థితి మారుతోందని జగన్ వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ సరఫరా విషయంలో అన్ని రాష్ట్రాలు ఒకరికొకరు సహకారం అందించుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ లభ్యత పెంచుకోవడం దేశ తక్షణ అవసరమని లేఖలో జగన్ పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-04T01:45:58+05:30 IST