Jagan కుంభకోణాలను బయటపెడతా: లోకేష్‌

ABN , First Publish Date - 2022-05-28T00:19:22+05:30 IST

సీఎం జగన్‌ కుంభకోణాలను బయటపెడతానని టీడీపీ నేత నారా లోకేష్‌ వెల్లడించారు. మీడియా చిట్‌చాట్‌లో లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

Jagan కుంభకోణాలను బయటపెడతా: లోకేష్‌

ప్రకాశం: సీఎం జగన్‌ కుంభకోణాలను బయటపెడతానని టీడీపీ నేత నారా లోకేష్‌ వెల్లడించారు. మీడియా చిట్‌చాట్‌లో లోకేష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాలకు సంబంధించి పక్కా ఆధారాలున్నాయని ప్రకటించారు. అన్ని బయటపెడతా.. జగన్‌ నైజం ప్రజలకు వివరిస్తానని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని స్పష్టం చేశారు. జగన్ తన పార్టీ కార్యకర్తలను గాలికొదిలేశారని తప్పుబట్టారు. ప్రతిపక్షాలను, ప్రజలను హింసించిన వైసీపీ నేతలు.. ఇప్పుడు సొంత పార్టీ కేడర్‌ను కూడా హింసిస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ కేడరే ఆ పార్టీ నేతలపై తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. పార్టీ ఆదేశిస్తే.. ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని లోకేష్‌ ప్రకటించారు.

Updated Date - 2022-05-28T00:19:22+05:30 IST