ఎమ్మెల్యేలకు Jagan చివాట్లు!

ABN , First Publish Date - 2022-06-08T21:54:11+05:30 IST

అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు ‘గడపగడప’ సెగ ఊపిరాడనీయడం లేదు. ఏ ఇంటికి వెళ్తే ఏం జరుగుతోందోననే భయం వీరిని గడగడలాడిస్తోంది.

ఎమ్మెల్యేలకు Jagan చివాట్లు!

అమరావతి: అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు ‘గడపగడప’ సెగ ఊపిరాడనీయడం లేదు. ఏ ఇంటికి వెళ్తే ఏం జరుగుతోందోననే భయం వీరిని గడగడలాడిస్తోంది. ఎక్కడ ఏ వీడియో బయటకు వచ్చి పరువు తీసేస్తుందోననే వణుకు పుట్టిస్తోంది. ఇంటింటికి వెళ్తే ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలు తిరగబడుతుండడంతో తలెత్తుకోలేక ఇప్పుడు అధికార పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పూర్తిగా నీరసించిపోయింది. గతనెల 11న ఆర్భాటంగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమం చల్లబడిపోయింది. ఈ నేపథ్యంలో గడపగడప కార్యక్రమంపై సీఎం జగన్ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో ఎమ్మెల్యేలకు జగన్ చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. సమస్యలు చెప్పిన ఎమ్మెల్యేలపై జగన్‌ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 


పొలాలకు రోడ్లు వేయాలని, 15వ ఆర్థికసంఘం నిధులు విడుదల చేయాలని ఆదోని బ్రదర్స్‌ కోరారు. రహదారులకే నిధుల్లేవని, పొలాలకు రోడ్లు ఎలా వేస్తామని, ప్లీనరీలోపు నిధులు విడుదల చేస్తామని జగన్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముస్లిం యువతులకు షాదీముబారఖ్‌ ఇవ్వాలని ఎమ్మెల్యేలు కోరారు. ఇవ్వడం సాధ్యం కాదని జగన్‌ తెగేసిచెప్పారట. అమ్మఒడి ముస్లిం మహిళలకు కూడా వస్తుంది కదా అని ఎమ్మెల్యేలకు జగన్ ఎదురు ప్రశ్న చేశారని చెబుతున్నారు. అమ్మఒడి పథకానికి కోతలేశారు.. ఒక్కో నియోజకవర్గానికి రూ.7, 8 వేలు కట్ చేశారని మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సీఎం దృష్టికి తెచ్చారు. గత రెండేళ్లు పొరపాటున ఇచ్చారని, మళ్లీ అదే రిపీట్‌ చేయాలా? అని జగన్‌ ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం రాకపోతే చెప్పండి.. వెంటనే మార్గదర్శకాలు చదవాలని ఎమ్మెల్యేలకు సీఎం హితబోధ చేశారు.

Updated Date - 2022-06-08T21:54:11+05:30 IST