జగన్‌ పాలనలో ప్రజలపై భారం : కురుగొండ్ల

Published: Sat, 25 Jun 2022 22:27:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 జగన్‌ పాలనలో ప్రజలపై భారం : కురుగొండ్లవృద్ధురాలి సమస్య వింటున్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ

సైదాపురం, జూన్‌ 25: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పాలనలో రాష్ట్ర ప్రజలపై పలు భారాలు మోపాడని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ  దుయ్యబట్టారు. శనివారం టీడీపీ మండల అధ్యక్షుడు కట్టా మోహన్‌కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని కట్టుబడిపల్లి, దేవరవేమూరు గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి క్యాండిల్స్‌, అగ్గిపెట్టెలు, కరపత్రాలు పంపిణీ చేశారు. స్థానికులు తమ గ్రామసమస్యలను నేతలకు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి తప్ప ఈ ప్రభుత్వంలో అభివృద్ధే లేదన్నారు. గ్రామాల్లో మహిళలు రామకృష్ణకు కర్పూరహారతులు ఇస్తూ పూలజల్లులు, మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కొండూరు సుబ్రహ్మణ్యంరాజు, నలమారు వెంకటేశ్వర్లురెడ్డి, మేడికొండ రమణయ్యనాయుడు, దశయ్యనాయుడు, దిలీప్‌చౌదరి, విజయ్‌, కేపీరాజు, కిరణ్‌, రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.