సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జగన్‌ దంపతులు

Published: Fri, 14 Jan 2022 14:33:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జగన్‌ దంపతులు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దంపతులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద  సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. సీఎం సాంప్రదాయ పంచెకట్టుతో హాజరై సంబరాలను తిలకించారు. అర్చకులు జగన్‌ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కచెల్లెల్లే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెమ్మలు, సోదరులు, స్నేహితులు, అవ్వాతాతలు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.