రైతు భరోసా కార్యక్రమంలో కనిపించని Jagan Photo.. డిప్యూటీ సీఎం ఆగ్రహం

Published: Mon, 16 May 2022 19:11:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రైతు భరోసా కార్యక్రమంలో కనిపించని Jagan Photo.. డిప్యూటీ సీఎం ఆగ్రహం

సాలూరు: అధికారులపై డిప్యూటీ సీఎం రాజన్న దొర చిందులు తొక్కారు. అతిగా వ్యవహరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయమని కలెక్టర్ నిషాంత్ కుమార్ కు ఆదేశించారు. ఎన్ని సార్లు చెప్పినా..అధికారుల్లో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఫొటో లేకుండా ఏ ఫ్లెక్సీ కూడా పెట్టవద్దని ఆదేశించారు. రైతు భరోసా కార్యక్రమం సందర్భంగా అధికారులు వ్యక్తి పూజకు పరిమితమయ్యారు. ఊరంతా ఫ్లెక్సీలు కట్టారు. ఈ ఫ్లెక్సీల ప్రింటింగ్ వ్యవహారంలోనే రాజన్న దొర రగిలిపోయారు. ముఖ్యమంత్రి ఫొటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా కడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫొటో తీసి వేయడం వెనుక కారణం చెప్పాలని పట్టుబట్టారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.