కుప్పంలో మూడేళ్ల అభివృద్ధిపై జగన్‌ శ్వేతపత్రం విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-09-25T05:43:13+05:30 IST

కుప్పంలో మూ డేళ్ల తన పాలనా కా లంలో ఏం అభివృద్ధి చేశారో సీఎం జగన్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నియోజకవర్గ పరిశీల కుడు గాజుల ఖాదర్‌బాషా డిమాండ్‌ చేశారు.

కుప్పంలో మూడేళ్ల అభివృద్ధిపై జగన్‌ శ్వేతపత్రం విడుదల చేయాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఖాదర్‌బాషా

కుప్పం, సెప్టెంబరు 24: కుప్పంలో మూ డేళ్ల తన పాలనా కా లంలో ఏం అభివృద్ధి చేశారో సీఎం జగన్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ నియోజకవర్గ పరిశీల కుడు గాజుల ఖాదర్‌బాషా డిమాండ్‌ చేశారు. కు ప్పాన్ని పులివెందుల చేయనవసరం లేదని, ఆ రౌడీ సంస్కృతి వద్దని వ్యగ్యంగా అన్నారు. కుప్పంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఖాదర్‌బాషా మాట్లాడుతూ... గతంలో గజ దొంగలను చూసి భయపడితే ఇప్పుడు ప్రజలు సీఎంను చూసి భయపడుతున్నారని విమర్శించారు. ఆయన పాలన హిట్లర్‌ను మించిపోయిందన్నారు. సీఎం కుప్పం పర్యటన సందర్భంగా ఆర్టీసీ బస్సులను విచ్చలవిడిగా జనాలను తరలించేందుకు ఉయోగించడం దారుణమన్నారు. కుప్పం ప్రజలపై మాటల్లో తప్ప చేతల్లో ఆయన ప్రేమ చూపించడం లేదన్నారు. పదవులన్నీ సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టి, బీసీలకు మొండిచేయి చూపించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియో జకవర్గంలో అమూల్‌ డైరీ పెట్టగలరా అని నిల దీశారు. కుప్పంలో చంద్రబాబు అభివృద్ధి చేస్తే పులి వెందులలో జగన్‌ రౌడీ సంస్కృతి తీసుకొచ్చా రని విమర్శించారు. రెండు నియోజకవర్గాలలో చంద్ర బాబు, జగన్‌ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని వైసీపీ నేతలకు సవాల్‌ విసిరారు. వైసీపీ నాయకులు దోచుకో, పంచుకో అనే పద్ధతినే పా టిస్తున్నారని, ప్రజల గురించి పట్టించు కోవడం లేదని ధ్వజమెత్తారు. మారుమూల ప్రాంతమైన కుప్పంలో రోడ్లువేసి, భవనాలు నిర్మించి, చెక్‌ డ్యాములు కట్టి, ప్రజల అసరాలు, సమస్యలు తీర్చింది చంద్రబాబు కాక మరెవరని ప్రశ్నించారు. విద్య, వైద్య, ఉపాధి రంగాలు ఆయన హయాంలో ఇక్కడ వెలిగిపోయాయని, ఈ వాస్తవాన్ని ఒక్క క్పుంలోనే కాక, రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. కుప్పాన్ని చంద్రబాబు అభివృద్ధికి చిరునామాగా మారిస్తే, జగన్‌ గొడవలు, దాడులు, తప్పుడు కేసులు, అరెస్టులతో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. ఈసారి కుప్పంలో వైసీపీకి డిపాజిట్‌ కూడా దక్కదని ఖాదర్‌బాషా స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-25T05:43:13+05:30 IST