వ్యవస్థలపై Jaganకు నమ్మకం లేదు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2022-05-27T21:41:23+05:30 IST

టీడీపీ మహానాడులో ఆ పార్టీ నేతలు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు 4 తీర్మానాలను ప్రవేశపెట్టారు.

వ్యవస్థలపై Jaganకు నమ్మకం లేదు: సోమిరెడ్డి

ప్రకాశం: టీడీపీ మహానాడులో ఆ పార్టీ నేతలు తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. ఇప్పటివరకు 4 తీర్మానాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ వేధింపులు, బాదుడే బాదుడు, సంక్షేమ పథకాల్లో మోసం, కష్టాల కడలిలో సేద్యం అంశాలపై తీర్మానాలకు మహానాడు ఆమోదం తెలిపింది. ప్రజాస్వామిక వ్యవస్థల విధ్వంసంపై మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ వ్యవస్థలపై సీఎం జగన్‌రెడ్డికి నమ్మకం లేదని ఆరోపించారు. పరిపాలనా వ్యవస్థను జగన్ భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో జగన్‌ చేసిన అవినీతికి ఐఏఎస్‌లు జైలు పాలయ్యారని గుర్తుచేశారు. అధికారులను వాడుకుని వదిలేయడం జగన్‌కు అలవాటని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. 


అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యంపై మాజీమంత్రి నక్కా ఆనందబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దళిత నియోజకవర్గంలో ఉన్న అమరావతిపై కుల ముద్ర వేశారని, అమరావతి నిర్మాణం ఆపేస్తే రాష్ట్రానికి, దళిత, బడుగులకు నష్టమన్నారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని నక్కా ఆనందబాబు దుయ్యబట్టారు.

Updated Date - 2022-05-27T21:41:23+05:30 IST