AP News: జగన్‌ కన్ను పడితే సర్వనాశనమే: విష్ణుకుమార్‌రాజు

ABN , First Publish Date - 2022-08-02T01:23:20+05:30 IST

ముఖ్యమంత్రి (Chief Minister Jagan) జగన్‌ కన్ను పడితే ఏదైనా సర్వనాశనమేనని, ఇందుకు విశాఖలో రుషికొండ ఒక నిదర్శనమని బీజేపీ

AP News: జగన్‌ కన్ను పడితే సర్వనాశనమే: విష్ణుకుమార్‌రాజు

విశాఖపట్నం: ముఖ్యమంత్రి (Chief Minister Jagan) జగన్‌ కన్ను పడితే ఏదైనా సర్వనాశనమేనని, ఇందుకు విశాఖలో రుషికొండ ఒక నిదర్శనమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజు (Vishnu Kumar Raju) దుయ్యబట్టారు.సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పచ్చటి రుషికొండ పర్యాటకులను ఎంతో అలరించేదని, జగన్‌ కన్ను పడ్డాక.. దాని రూపమే మారిపోయిందన్నారు.  అక్కడ ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడానికి హైకోర్టు న్యాయవాది వస్తే.. ఆయనతో పాటు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టారని తెలిపారు. త్వరలో విశాఖ బీచ్‌ (Visakha Beach)ను కూడా తాకట్టు పెట్టేసి, అక్కడికి వెళ్లే సందర్శకుల నుంచి కూడా చార్జీలు వసూలు చేస్తారేమోనని విశాఖ ప్రజలు భయపడుతున్నారని తెలిపారు. మూడు రాజధానులపై ఎవరికీ నమ్మకం లేదని, ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతే రాజధానిగా ఉండాలని స్పష్టం చేశారు. అంతగా కావాలంటే.. కడపను సొంత రాజధానిగా ప్రకటించుకోవాలని ముఖ్యమంత్రికి సూచించారు. వైసీపీ అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నిషేధం అమలుచేస్తామని 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి, ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విష్ణుకుమార్‌రాజు దుయ్యబట్టారు.

Updated Date - 2022-08-02T01:23:20+05:30 IST