జగన తుగ్లక్‌ పాలనకు చరమగీతం పాడాలి: టీడీపీ

ABN , First Publish Date - 2021-12-08T06:11:26+05:30 IST

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్మోహన రెడ్డి మతి లేని పరిపాలన సాగిస్తూ పిచ్చి తుగ్లక్‌ లా వ్యవహరిస్తున్నాడని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు వి మర్శిం చారు.

జగన తుగ్లక్‌ పాలనకు చరమగీతం పాడాలి: టీడీపీ
గుంతకల్లు మండలం గుండాల తండా గౌరవ సభలో ప్రసంగిస్తున్న జితేంద్రగౌడు

 గుంతకల్లు, డిసెంబరు 7: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్మోహన రెడ్డి మతి లేని పరిపాలన సాగిస్తూ పిచ్చి తుగ్లక్‌ లా వ్యవహరిస్తున్నాడని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడు వి మర్శిం చారు. మంగళవారం మండలంలోని గుండాల తండాలో టీడీపీ నాయకులు ప్రజా సమస్యలపై ’గౌరవ సభ’ చర్చావేదిక నిర్వహించా రు. ఈ సందర్భంగా జితేంద్రగౌడు మాట్లాడుతూ తుగ్లక్‌ తన రాజధానిని మార్చడానికి విఫలయత్నం చేసినట్లు.. జగన కూడా మూడు రాజధానులం టూ పిచ్చి చేష్టలు చేశాడన్నారు. తీరా కోర్టులో చుక్కెదురయ్యేసరికి మడమతిప్పాడని విమర్శించారు. ఈమాత్రం తెలివి మొదటే లేకుండా పో యిందని విమర్శించారు. అవగాహన లేక అడ్డదిడ్డమైన పరిపాలన సా గించి రాషా్ట్రన్ని అధోగతి పాల్జేశాడన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా చేశాడన్నారు. ఆదాయానికి తగినట్లు సంసారాన్ని లాక్కు వస్తున్న పేద, మధ్య తరగతి మహిళల అంచనాలను తారుమారుచేస్తూ ఇంధన, కరెంటు ధరలను పెంచేసి ఇబ్బందుల పా ల్జేశాడన్నారు. ఓటీఎస్‌ పేరిట పేదల నుంచి డబ్బులు దండుకోవడానికి కొత్త పథకం రచించాడన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకంపై ప్రజలు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం ముదావాహమన్నారు. ప్రజలందరూ మాయ పథకమైన ఓటీఎ్‌సకు ఆకర్షితులు కారాదని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా గృహాలను రిజిస్ట్రేషన చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఆమ్లెట్‌ మస్తాన యాదవ్‌, మాజీ ఎంపీపీ రాయల రామయ్య, సర్పంచు శ్రీరాములు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు పాల మల్లికార్జున, మాజీ కౌన్సిలరు హనుమంతు, నాయకులు కేశప్ప, ఓబుళాపురం రామకృష్ణ, గోపాల్‌, సోమశేఖర్‌, అయ్య ప్ప నాయక్‌, గోపాల్‌ నాయక్‌, రమేశ, భాస్కర్‌, మోటు నాయక్‌, రాజా, ప్రకాశ నాయక్‌ పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం: వైసీపీ ఓటీఎస్‌ పథకాన్ని నమ్మి ప్రజలు మోసపోరాదని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. మంగళవారం శెట్టూరు మండలంలోని అయ్యగార్లపల్లి, చింతర్లపల్లిలో ఆయన గౌరవ సభ నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలపై ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఇళ్లకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.15 వేల ప్రకారం చెల్లించి సచివాలయాల్లో రిజిస్ట్రేషన చేసుకోవాలని ప్రభుత్వం చేస్తున్న ప్రచారం బూటకమని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రతి లబ్ధిదారునికి ఉచితంగా రిజిస్ట్రేషన చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు దొడగట్ట నారాయణ, మాదినేని మురళి, తలారి సత్యప్ప, రామరాజు, తిప్పారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, భాగ్యమ్మ, రంగనాథ్‌, నగేష్‌, ఆదిశేషు, గంగాధర్‌, వన్నూర్‌వలీ, ఇమ్రాన, లింగప్ప, సురేష్‌, గోవిందప్ప, నరసింహమూర్తి, ఎర్రిస్వామి, తిప్పేస్వామి, చెండ్రాయుడు, చంద్రశేఖర్‌, తంజల్‌ పాల్గొన్నారు. 


ప్రభుత్వ మోసపూరిత వాగ్దానాలను నమ్మరాదని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయచౌదరి తెలిపారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో ఆయన గౌరవసభ నిర్వహించారు. ఓటీఎస్‌ మోసాలను ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో సీఎం జగన కొత్త ఎత్తుగడతో లబ్ధిదారుల నుంచి దం డుకునేందుకు ఓటీఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టారని వి మర్శించారు. టీ డీపీ అధికారంలోకి రాగానే ఇళ్లకు ఉచితంగా రిజిసే్ట్రషన చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు ఆర్జీ శివశంకర్‌, ఆవుల తిప్పేస్వామి, డీకే రామాంజినేయులు, గాజుల శ్రీరాములు, తలారి ఎర్రిస్వామి, కొల్లాపురప్ప, నారాయణ, శివప్రసాద్‌, రాయపాటి రామాంజినేయులు, ఓ బయ్య, వన్నూరుస్వామి, తిమ్మరాజులు, సుధాకర్‌, హనుమన్న, ఈరప్ప, రాజన్న పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-08T06:11:26+05:30 IST